Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస మండలం సుమ్మాదేవి రైల్వే గేటు దగ్గర జీపు టైరు పేలడంతో నలుగురు ఎస్కార్ట్ పోలీసులు దుర్మరణం చెందారు. వారిని ఏఆర్ కానిస్టేబుళ్లుగా గుర్తించారు. వారు ఓ ఆర్మీ జవాను అంత్యక్రియల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలి, అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ కృష్ణం నాయుడు, హెడ్ కానిస్టేబుల్స్ జనార్థనరావు, ఆంటోనీ, కానిస్టేబుల్ బాబూరావులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Advertisement
Advertisement