Abn logo
Aug 18 2021 @ 10:13AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: టేకులపల్లి  మండలం, రోళ్ళపాడు క్రాస్ రోడ్ కల్వర్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కాల్వలో పడింది. ఈ ఘటనలో టేకులపల్లి  మండలం, మద్రాసు తండాకు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాను మాళోతు జగదీష్ బాబు మృతి చెందారు. ఆయన చెన్నైలో సీఆర్‌పీఎఫ్ జవానుగా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.