Abn logo
Jun 20 2021 @ 19:48PM

గుంటూరు జిల్లా... ఘోర రోడ్డుప్రమాదం

గుంటూరు: తాడేపల్లి కరకట్ట వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మృతులు అమరావతి మండలం మునగోడు వాసులుగా గుర్తించారు. మైలవరం అత్తగారింటికి వెళ్లి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. మృతులు కోట మరియదాసు(36), కోట ఏసు కుమారి (32)  కోట తేజ (13) గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.