ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఓపీ సేవలు నిలిపివేయాలి

ABN , First Publish Date - 2020-04-04T10:47:03+05:30 IST

ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఓపీ సేవలు నిలిపివేయాలని కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. శుక్రవారం ప్రైవేట్‌

ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఓపీ సేవలు నిలిపివేయాలి

 కలెక్టర్‌ శశాంక 


సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 3: ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఓపీ సేవలు నిలిపివేయాలని  కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. శుక్రవారం ప్రైవేట్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ అసోసియేషన్‌, మందుల పాష్‌ అసోసియేషన్‌ వారితో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణ ప్రజలు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు వస్తే ముందుగా ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్దకు వస్తుంటారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓపీ చూడవద్దని, వారికి ఎటువంటి పరీక్షలు నిర్వహించవద్దన్నారు.


ఆర్‌ఎంపీ, పీఎంపీ వద్దకు వచ్చే వారికి కరోనా వైరస్‌ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తూ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లేలా అవగాహన కల్పించాలన్నారు. ఎవరికైనా దగ్గు, జ్వరం, జలుబు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలుంటే తప్పకుండా ప్రభుత్వ వైద్యశాలకు పంపించాలని ఆదేశించారు. ఈసమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ సుజాత, డీటీసీవో డాక్టర్‌ కేవీ రవీందర్‌రెడ్డి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ రవిసింగ్‌, ప్రైవేట్‌ మెడికల్‌ ప్రాక్టిషనర్స్‌ అసోసియేషన్‌, మందుల పాష్‌ అసోసియేషన్‌ బాధ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-04T10:47:03+05:30 IST