Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్కే త్యాగం మరువలేనిది

సూర్యాపేట కల్చరల్‌, అక్టోబరు 16: అణగారిన బతుకుల బాగుకోసం ఉపాధ్యాయుడి నుంచి ఉద్యమ బాటపట్టి నాలుగు దశాబ్ధాలపాటు అలుపెరగని పోరాటాలు చేసిన ఆర్కే త్యాగం మరువలేనిదని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని చండ్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రం వద్ద ఆర్కే చిత్రపటానికి పూల మాలలే వేసి శనివారం నివాళులర్పించారు. నమ్మిన సిద్దాంతం కోసం ఉద్యమ ప్రస్థానంలో తన ఏకైక కుమారుడు తన కళ్ల ముందే ఎన్‌కౌంటర్‌లో అమరుడైనా చలించని వీరయోధుడు ఆర్కే అని కొనియాడారు. ఆదివాసీలకు అండగా వారి హక్కుల సాధన కోసం చివరివరకు సాయుధపోరు సాగించిన ఆర్కే పీడిత ప్రజల విముక్తి కోసం సాగే పోరాటం లో సజీవంగానే ఉంటారన్నారు. కార్యక్రమంలో నాయకులు కునుకుంట్ల సైదులు, కారింగుల వెంకన్న, సయ్యద్‌, సీపీఐ నాయకులు గాలి కృష్ణ, సంజీవ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement