బాల వికాస్ నెల రోజుల శిబిరం

ABN , First Publish Date - 2021-06-18T21:39:14+05:30 IST

బాల్యం నుంచే చిన్నారులకు నైతిక విలువలు నేర్పించడం, పురాణేతిహాసాల్లోని మంచిని అందించడం ద్వారా వారిని రేపటి భారతానికి ఉత్తమ పౌరులను అందించగలం.

బాల వికాస్ నెల రోజుల శిబిరం

హైదరాబాద్: బాల్యం నుంచే చిన్నారులకు నైతిక విలువలు నేర్పించడం, పురాణేతిహాసాల్లోని మంచిని అందించడం ద్వారా వారిని రేపటి భారతానికి ఉత్తమ పౌరులను అందించగలం. ఇదే ఆలోచనా ధోరణితోనే నగరానికి చెందిన రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(వీఐహెచ్ఈ) పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తోంది. తరుచూ వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. ఈ ఏడాది చిన్నారులకు నెల రోజుల ఆన్ లైన్ క్యాంప్ నిర్వహించ తలపెట్టింది. కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల కారణంగా ప్రత్యక్ష తరగతులను నిర్వహించలేకపోతున్న విషయం తెలిసిందే. 4 నుంచి 10వ తగరతి విద్యార్థులు అర్హులు. జూలై 5 నుంచి ఆగస్ట్ 5 వరకు ఈ శిబిరం ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు యోగాసనాలు, ధ్యానం, జపం ఉంటాయి. అలాగే సోమ, బుధ, శుక్రవారాల్లో నైతిక విలువల బోధన, భజనలు నేర్పిస్తారు. ఆదివారాలు తరగతులు ఉండవు. 


రిజిస్ట్రేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. https://rkmath.org/vihe/


మరిన్ని వివరాలకు 9177232696 నంబర్‌కు ‘Hi’ అని వాట్సాప్ మెసేజ్ చేయగలరు. లేదా hyderabad.vihe@rkmm.orgకు మెయిల్ చేయగలరు.

Updated Date - 2021-06-18T21:39:14+05:30 IST