రాంచీ, జనవరి 23: జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌స(ఎయిమ్స్)కు తరలించారు. రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(రిమ్స్)లో చికిత్స పొందుతున్న ఆయన.. రెండు రోజులుగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నారు. శుక్రవారం ఆయనకు నిమోనియా ఉన్నట్లు తేలడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కి తరలించారు.