ఎత్తైన శిఖరం ఎక్కిన తెలుగు తేజం

ABN , First Publish Date - 2021-03-05T05:38:05+05:30 IST

కిలిమంజారో పర్వతంపై ఉండే గిల్మన్‌ పాయింట్‌ను చేరుకోవాలని పర్వతారోహకులు కలలు కంటారు. ఎంతో శ్రమతో కూడుకున్న ఆ పర్వతారోహణలో కొంతమంది మాత్రమే విజయం సాధించారు

ఎత్తైన శిఖరం ఎక్కిన తెలుగు తేజం

కిలిమంజారో పర్వతంపై ఉండే గిల్మన్‌ పాయింట్‌ను చేరుకోవాలని పర్వతారోహకులు కలలు కంటారు. ఎంతో శ్రమతో కూడుకున్న ఆ పర్వతారోహణలో కొంతమంది మాత్రమే విజయం సాధించారు. ఇప్పుడు వారి జాబితాలో అనంతపూర్‌ జిల్లా యం.అగ్రహారంకు చెందిన తొమ్మిదేళ్ల రిత్విక శ్రీ చేరింది. కిలిమంజారో పర్వతం ఎక్కిన అతి పిన్న వయస్కురాలిగానూ గుర్తింపు పొందింది.

  • గిల్మన్‌ పాయింట్‌ సముద్రమట్టానికి 5681 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పాయింట్‌కు చేరుకున్న పర్వతారోహకులు అధికారికంగా సర్టిఫికెట్‌ను ప్రధానం చేస్తారు.
  • రిత్విక తండ్రి శంకర్‌ క్రికెట్‌ కోచ్‌, స్పోర్ట్స్‌ కంట్రిబ్యూటర్‌. రిత్విక కిలిమంజారో అధిరోహించడంలో ఆయన ఎంతగానో సహాయపడ్డారు.
  • రిత్విక తెలంగాణలోని భువనగిరిలో ఉన్న రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌లో లెవెల్‌ 1 శిక్షణ తీసుకుంది. తరువాత లద్దాఖ్‌లో లెవెల్‌ 2 శిక్షణ పొందింది.
  • మొదటి ప్రయత్నంలోనే కిలిమంజారోను అధిరోహించిన రిత్విక అనంతపూర్‌లోని సెయింట్‌ విన్సెంట్‌ డీ పౌల్‌ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది.

Updated Date - 2021-03-05T05:38:05+05:30 IST