మాస్క్‌తో పిల్లల్లో ఇమ్యూనిటీ తగ్గే ముప్పు

ABN , First Publish Date - 2021-06-20T08:59:04+05:30 IST

భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం అనే నిబంధనలు ఈ ఆరోగ్య సంక్షోభ వేళ ఎంతోమంది ప్రాణాలను రక్షించాయి. అయితే వీటి వల్ల పిల్లల వ్యాధి నిరోధక (ఇమ్యూనిటీ) వ్యవస్థ బలహీనపడిందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మాస్క్‌ వినియోగం వల్ల చాలామంది

మాస్క్‌తో పిల్లల్లో ఇమ్యూనిటీ తగ్గే ముప్పు

బ్రిటన్‌ శాస్త్రవేత్తల అభిప్రాయం


లండన్‌, జూన్‌ 19 : భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం అనే నిబంధనలు ఈ ఆరోగ్య సంక్షోభ వేళ ఎంతోమంది ప్రాణాలను రక్షించాయి. అయితే వీటి వల్ల పిల్లల వ్యాధి నిరోధక (ఇమ్యూనిటీ) వ్యవస్థ బలహీనపడిందని  బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మాస్క్‌ వినియోగం వల్ల చాలామంది పిల్లలు రెండేళ్లుగా ఫ్లూ తరహా సీజనల్‌ వైరల్‌ ఇన్ఫెక్షన్ల బారిన కూడా పడలేదని, ఫలితంగా ఇతర పిల్లల్లా వారి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ తగిన శక్తిని సంతరించుకోలేకపోయిందన్నారు.


ఈ కారణంగా భవిష్యత్తులో ఆకస్మికంగా ఎదురయ్యే పలు ఇన్ఫెక్షన్లు వారికి సమస్యలను సృష్టించొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. కొంతమంది ఏడాదిలోపు పసికందులకు రెస్పిరేటరీ సింకీషియల్‌ వైరస్‌(ఆర్‌ఎ్‌సవీ) వల్ల ఊపిరితిత్తుల తీవ్ర ఇన్ఫెక్షన్‌ ప్రబలుతుంటుందని.. రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న పిల్లలను ఇది సులువుగా చుట్టుముడుతుందని హెచ్చరించారు. కొవిడ్‌ సంక్షోభం సమసిపోయి.. మాస్క్‌ వినియోగం, భౌతికదూరం పాటించడం ఆగిపోగానే ఆర్‌ఎ్‌సవీ విజృంభించే అవకాశాలు ఉండొచ్చన్నారు.

Updated Date - 2021-06-20T08:59:04+05:30 IST