కొండెక్కిన కూరగాయల ధరలు

ABN , First Publish Date - 2022-05-21T06:30:50+05:30 IST

కూరగాయల ధరలు కొండెక్కాయి. ధరలు అమాంతంగా పెరగడంతో కొనుగోలుదారులకు చుక్కలు కనబడుతు న్నాయి.

కొండెక్కిన కూరగాయల ధరలు
మార్కెట్‌లో ఉన్న కూరగాయలు

పొదిలి, మే 20: కూరగాయల ధరలు కొండెక్కాయి. ధరలు అమాంతంగా పెరగడంతో కొనుగోలుదారులకు చుక్కలు కనబడుతు న్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ప్రస్తుతం కూరగాయలు కొనాలంటే జంకుతున్నారు. రూ.300 జేబులో వేసుకొని మార్కెట్‌ కు వెళ్లిన సంచిలో సగానికి కూడా కూరగాయలు రాని పరిస్థితి నెలకొంది. 20రోజుల క్రితం రూ.20 పలికిన టమోటాఽ దర అంచెలంచెలు గా ప్రస్తు తం రూ.80కి చేరింది. మిర్చి రూ.25 నుంచి రూ.50కి చేరింది. ఇక బీరకాయ, క్యారెట్‌, కాకర కూడా కిలో రూ.60నుంచి రూ.70కి చేరింది. కూరగాయల ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు ‘ఏమికొంటాం, ఏమితింటాం’ అని నిట్టూరుస్తు న్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు అధిక ఎండలు కారణంగా పంటలు దెబ్బతినడంతో ఆంధ్రాలో టమోటా పంట దిగుబడి తగ్గింది. దీంతో మదనపల్లి, బెంగుళూరు నుంచి టమోటా కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. టమోటా ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మాదిరెడ్డి పాలెం, కంభాలపాడు, బుచ్చన్నపాలెం గ్రామాలలో కొంతమంది రైతులు ప్రస్తుతం బోర్ల కింద ఆకుకూరలు పండించి అమ్మకాలు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కూరగాయలు కొనుగోలు చేయడంతో రవాణా చార్జీల భారంతో రేట్లు తడిసిమోపడయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజులలో ధరలు ఎలా ఉంటాయోనని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.


Updated Date - 2022-05-21T06:30:50+05:30 IST