శ్రీశైలానికి పెరుగుతున్న వరద

ABN , First Publish Date - 2022-10-05T08:41:58+05:30 IST

శ్రీశైలానికి పెరుగుతున్న వరద

శ్రీశైలానికి పెరుగుతున్న వరద

అమరావతి/శ్రీశైలం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద పెరుగుతోంది.  డ్యామ్‌ 5 క్రస్టుగేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,39,915  క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి జూరాల, సుంకేసుల నుంచి 1,16,516 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది.  జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 30,839 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. నాగార్జునసాగర్‌ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.15 టీఎంసీలు కాగా.. 311.15 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోనికి 94,969 క్యూసెక్కుల వరద వస్తుండగా... అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను 40.91 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోనికి 1,02,816 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ఈ ప్రవాహన్ని కిందకు ప్రకాశం బ్యారేజీకి వదిలేస్తుండటంతో.. ప్రకాశం బ్యారేజీ కూడా గరిష్ట నీటి నిల్వ 3.07 టీఎంసీలకు చేరింది. బ్యారేజీలోనికి 1,12,669 క్యూసెక్కుల వరద వస్తుండగా సముద్రంలోనికి 1,12,930 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Updated Date - 2022-10-05T08:41:58+05:30 IST