పెరుగుతున్న ఆర్థిక నేరాలు

ABN , First Publish Date - 2022-05-22T05:30:00+05:30 IST

దర్శి ప్రాంతంలో ఆర్థిక నేరాలు అధికమవు తున్నాయి. కొంతమంది చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారవుతున్నారు.

పెరుగుతున్న ఆర్థిక నేరాలు

దర్శి ప్రాంతంలో 

చిట్టీల పేరుతో దోచుకుంటున్న మోసగాళ్లు

అప్పులు చేసి పరార్‌

లబోదిబోమంటున్న బాధితులు 

దర్శి, మే 22 : దర్శి ప్రాంతంలో ఆర్థిక నేరాలు అధికమవు తున్నాయి. కొంతమంది చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారవుతున్నారు. మరి కొం తమంది అప్పులు తీసుకొని ఇతర ప్రాంతాలకు కనపడకుండా వెళ్తున్నారు. ఆరుగాలం కష్టించి దాచుకున్న సొమ్ము అనవసరంగా కోల్పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దర్శి ప్రాం తంలో పలువురు కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము దోచుకొని ఇతర ప్రాంతాల్లో యథేచ్ఛగా తిరుగుతున్నా పట్టించుకున్న నాధు డే లేడు. అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోక పోవటంతో మోసగాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తమకు ఏమీ కాదనే భావంతో పాత నేరగాళ్లను చూసి కొత్త మోసగాళ్లు సిద్ధమ వుతున్నారు. తాజాగా ధాన్యం అపరాలు కొనుగోలు చేస్తున్న వ్యా పారులు కూడా రైతులకు  సొమ్ము ఇవ్వకుండా ఎగనామం పెట్టి ఉడాయిస్తున్నారు. దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. 

సుమారు 3 సంవత్సరాల క్రితం దర్శి పంచాయతీలోని ఎస్‌.మాంతయ్య అనే వ్యక్తి చిట్టీలు వేస్తూ  ఆ ప్రాంత ప్రజలకు రూ.3కోట్ల మేర  కుచ్చుటోపీ పెట్టి పరా రయ్యా డు. బాధితులు పోలీస్‌స్టేషన్‌ చుట్టూ నెలల తరబడి తిరిగి నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత మాం తయ్య త్రిపురాంతకంలో దాచుకున్న ప్రజల సొమ్ముతో మంచి ఇళ్లు కొనుగోలు చేసుకొని అక్కడ నివాసం ఉంటున్నాడు. బాధితులు ఎన్నిసార్లు తిరిగినా ఒక్క రూపాయి కూడా వారికి చెల్లించలేదు. మండలంలో రాజంపల్లిలో రామారావు అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పెట్టుబడులు కోసం సుమారు రూ.8కోట్లు అప్పుచేశాడు. అప్పులు ఇవ్వలేక ఇతర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అద్దంకి ప్రాంతం నుంచి వచ్చి దర్శిలో పాల వ్యాపారం చేస్తూ  స్థిరపడిన బోడపూడి రాము పాల వ్యాపారం చేస్తూ అనేకమంది  నుంచి సుమారు రూ.5కోట్ల వరకూ అప్పులు  చేశాడు. ఏడాది క్రితం ఉడాయించాడు. అప్పులు ఇచ్చిన వారికి ఐపీ నోటీసులు దా ఖలు చేసి ఇతర ప్రాంతంలో నివాసం ఉంటు న్నాడు. దర్శిలో నివా సం ఉంటూ ముండ్ల మూరు మండలంలో ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్న రామానాయక్‌ చిట్టీల వ్యాపారం చేస్తూ సుమారు రూ.4కోట్ల మేర ఎగ్గొట్టాడు. దీంతో బాధితులు లబోదిబోమంటు న్నారు. మరికొంతమంది వద్ద అప్పులు తీసుకు న్నాడు.  ఎవరికీ డబ్బులు చెల్లించకుండా రాత్రికి రాత్రి ఇల్లు వదిలి ఇతర ప్రాంతాలకు పారిపోయాడు.  డబ్బులు ఇప్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నారు. 

తాజాగా దర్శి మండలం త్రిపురసుందరీపురం గ్రామానికి చెందిన బొల్లా శేషయ్య గత 20 సంవత్సరాలుగా నమ్మకంగా ఎరు వుల వ్యాపారం చేస్తూ ధాన్యం అపరాలు కొనుగోలు చేస్తూ ప్రజల్లో ఎంతో మంచిపేరు తెచ్చుకున్నారు. అనేకమంది రైతులు ధాన్యం అమ్మిన సొమ్ము వడ్డీకి అతని దెగ్గరే ఉంచారు. ఈ క్రమంలో సుమారు రూ.3కోట్ల మేర రైతులకు, అప్పు తీసుకున్న వ్యక్తులకు బకాయిపడి 10 రోజుల క్రితం ఇల్లు విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. బాధితులు తమకు డబ్బులు ఇప్పించి న్యా యం చేయాలని దర్శి పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ఉన్న వెసులుబాటును ఆసరాగా తీసుకొని ఆర్థిక నేరాలకు పాల్పడుతూ ప్రజల సొమ్ము కొట్లాది రూపాయలు స్వాహా చేస్తు న్నారు. అధికారులు చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అందువలన నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం జరగక కొంతమంది ఆర్థికంగా చితికిపోయి తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ఆర్థిక నేరాలకు పాలుపడుతున్న వారిపై పటిష్టమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.


Updated Date - 2022-05-22T05:30:00+05:30 IST