లండన్, ఆగస్టు 5: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో ముందున్న లిజ్ ట్రస్‌తో జరిగిన కీలక చర్చలో భారత సంతతికి చెందిన రిషి సునాక్ అనూహ్యంగా పైచేయి సాధించారు. ‘స్కై న్యూస్’ గురువారం నిర్వహించిన టీవీ డిబేట్‌లో అధిక శాతం ప్రేక్షకులు సునాక్‌కే మద్దతు ప్రకటించారు. ఈ చర్చ సందర్భంగా టీవీ ప్రజెంటర్ కే బర్లీ వేసిన కొన్ని ప్రశ్నలతో ట్రస్ ఇరకాటంలో పడ్డారు. దీంతో ట్రస్ కొద్దిగా అసహనానికి గురయ్యారు. ఇక చర్చలో భాగంగా రిషి సునాక్ సైతం కొన్ని కఠినమైన ప్రశ్నలు ఎదుర్కొన్నారు. డిబేట్ అనంతరం ఓటింగ్‌లో సునాక్‌కే ఎక్కువ మంది మద్దతిచ్చారు.
ఇవి కూడా చదవండి