Rishi Sunak: రిషికి భారీ ఊరట.. కొంచెం తగ్గిన లిజ్‌ ట్రస్‌ మెజారిటీ

ABN , First Publish Date - 2022-08-03T13:10:24+05:30 IST

బ్రిటన్‌ ప్రధాని రేసులో గత కొన్ని రోజులుగా వెనుకబడ్డ రిషి సునాక్‌ కాస్త ముందడుగు వేశారు.

Rishi Sunak: రిషికి భారీ ఊరట.. కొంచెం తగ్గిన లిజ్‌ ట్రస్‌ మెజారిటీ

బ్రిటన్‌ ప్రధాని రేసులో లిజ్‌ ట్రస్‌కు చేరువగా రిషి

లండన్‌, ఆగస్టు 2: బ్రిటన్‌ ప్రధాని రేసులో గత కొన్ని రోజులుగా వెనుకబడ్డ రిషి సునాక్‌ కాస్త ముందడుగు వేశారు. తాజా సర్వేలో ఆయన లిజ్‌ ట్రస్‌ కంటే కేవలం 5పాయింట్ల వెనుకంజలో ఉన్నారు. 807మంది కన్జర్వేటీవ్‌ పార్టీ సభ్యులతో గత వారం నిర్వహించిన ఈ సర్వే ఫలితాన్ని మంగళవారం ప్రకటించారు. ఇందులో లిజ్‌ ట్రస్‌కు 48% మంది, రిషికి 43% మంది మద్ధతు తెలిపారు. మరో 9% మంది ఎటూ తేల్చుకోలేకపోయారు. 

Updated Date - 2022-08-03T13:10:24+05:30 IST