ఎన్నికల పాంప్లెట్‌లలో అక్షర దోషం.. రిషి సునాక్‌పై ట్రోలింగ్..

ABN , First Publish Date - 2022-07-17T03:13:58+05:30 IST

బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న భారత సంతతి మాజీ మంత్రి రిషి సూనాక్‌ను రోజుకో సమస్య చుట్టుముడుతోంది.

ఎన్నికల పాంప్లెట్‌లలో అక్షర దోషం.. రిషి సునాక్‌పై ట్రోలింగ్..

ఎన్నారై డెస్క్: బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న భారత సంతతి మాజీ మంత్రి రిషి సూనాక్‌ను(Rishi sunak) రోజుకో సమస్య చుట్టుముడుతోంది. తాజాగా ఓ అక్షర దోషం కారణంగా రిషి సునాక్‌పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆయన ఎన్నికల ప్రచార పోస్టర్‌లోని ఓ పదంలో తప్పు దొర్లింది. 'campaign'కి బదులు 'campiaign' అని తప్పు దొర్లింది. తప్పుపదం ఉన్న పోస్టర్ తన వెనకున్న గోడపై కనిపిస్తుండగా.. రిషి తన సామర్థ్యాలు, ప్రధాన్యతనల గురించి వివరిస్తూ టీవీలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు దీంతో.. ఆయన ప్రత్యర్థులు ట్విటర్ వేదికగా రెచ్చిపోయారు. విపరీతంగా ట్రోలింగ్‌కు దిగారు. పోస్టర్‌పై ఉన్న తప్పును కూడా గుర్తించలేకపోయారా అంటూ కామెంట్లు పెట్టారు.  


ఈ ట్రోలింగ్‌పై రిషి సునాక్ తాజాగా స్పందించారు. ఏ తప్పుడు స్పెల్లింగ్ అయినా సరిచేసేందుకు రెడీ అంటూ ఒక్కమాటలో ట్రోలింగ్‌కు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. రెడీ ఫర్ రిషీ అనే తన ప్రచార నినాదాన్ని గుర్తుకు తెచ్చేలా రెడీ ఫర్ స్పెల్ చెక్(spellcheck) అంటూ ఓ ట్వీట్ చేశారు. ఇక ప్రధాని రేసులో ముందుకు దూసుకుపోతున్న రిషికి ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నట్టు స్థానిక మీడియా చెబుతోంది. ఆయన గతంలో పన్నుల పెంచడంపై అక్కడి వారు గుర్రుగా ఉన్నారట. మరోవైపు.. రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి బ్రిటన్‌లో పన్నులు చెల్లించకపోవడంపై కూడా విమర్శలు రేగాయి. తనకు స్థానికత హోదా లేని కారణంగానే ట్యాక్స్ చెల్లించట్లేదని అక్షతా మూర్తి  అప్పట్లో వివరణ ఇచ్చారు. ఇకపై పన్నులు కడతానని మాట కూడా ఇచ్చారు. 

Updated Date - 2022-07-17T03:13:58+05:30 IST