UK ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్

ABN , First Publish Date - 2022-07-07T21:43:26+05:30 IST

భారత సంతతికి చెందిన రిషి సునక్ (Rishi Sunak) బ్రిటన్ తదుపరి ప్రధాని రేసులోకి వచ్చారు. కన్జర్వేటివ్ ప్రభుత్వం

UK ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్

లండన్: భారత సంతతికి చెందిన రిషి సునక్ (Rishi Sunak) బ్రిటన్ తదుపరి ప్రధాని రేసులోకి వచ్చారు. కన్జర్వేటివ్ ప్రభుత్వం నుంచి దాదాపు 40 మంది మంత్రులు, సహాయకులు ఇప్పటికే రాజీనామా చేసి వైదొలిగారు. వారిలో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్ రిషి సునక్ కూడా ఉన్నారు. తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న ఆయన కనుక ప్రధాని అయితే ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కుతారు. 


42 ఏళ్ల రిషి సునక్‌ను ప్రధాని బోరిస్ జాన్స్ (Boris Johson) ఫిబ్రవరి 2020లో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్‌గా నియమించారు. ఫలితంగా తొలిసారి పూర్తిస్థాయి కేబినెట్ హోదా పొందారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం 10 బిలియన్ పౌండ్ల విలువైన భారీ ప్యాకేజీని ప్రకటించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ‘డిషీ’ (Dishy) పేరుతో రిషి అందరికీ చిరపరిచితం.


కరోనా సమయంలో డౌనింగ్ స్ట్రీట్‌లోని జరిగిన ప్రధాని బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నందుకు గాను జరిమానాను కూడా ఎదుర్కొన్నారు. రిషి సునక్ తాతలు పంజాబ్ నుంచి వచ్చారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తి (Akshata Muthy)ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు.

Updated Date - 2022-07-07T21:43:26+05:30 IST