India vs England Edgbaston Test : కష్టాల్లో భారత్.. ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పంత్, రవీంద్ర జడేజా..

ABN , First Publish Date - 2022-07-02T03:39:36+05:30 IST

ఎడ్జ్‌బాస్టన్ టెస్టు(Edgbaston Test)లో టీమిండియా టాప్-ఆర్డర్ కుప్పకూలినా.. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా భాగస్వామ్యం

India vs England Edgbaston Test : కష్టాల్లో భారత్.. ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పంత్, రవీంద్ర జడేజా..

బర్మింగ్‌హామ్ : ఎడ్జ్‌బాస్టన్ టెస్టు(Edgbaston Test)లో టీమిండియా టాప్-ఆర్డర్ కుప్పకూలినా.. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ని చక్కదిద్దేందుకు పోరాడుతోంది. 6వ వికెట్‌కు వీరిద్దరూ 130కిపైగా పరుగుల పార్టనర్‌షిప్‌ నెలకొల్పి నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. మొదటి రోజు ఆట ఇంకా 29 ఓవర్లు మిగిలివున్న సమయానికి భారత్ స్కోరు 224/5గా ఉంది. 88 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్న రిషబ్ పంత్ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. 43 పరుగులతో నాటౌట్ ఉన్న రవీంద్ర జడేలా హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. 


కాగా టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (17), చతేశ్వర పుజారా (13) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హనుమ విహారి(20) ఎల్‌బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 15 పరుగులే జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో బిల్లింగ్స్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 3 వికెట్లు పడగొట్ట టీమిండియాని కష్టాల్లో పడేశాడు. మ్యాటీ పొట్స్ 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

Updated Date - 2022-07-02T03:39:36+05:30 IST