ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలుగొట్టిన రిషభ్ పంత్

ABN , First Publish Date - 2021-01-19T21:49:41+05:30 IST

గబ్బా టెస్ట్ హీరో రిషభ్‌పంత్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన

ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలుగొట్టిన రిషభ్ పంత్

బ్రిస్బేన్: గబ్బా టెస్ట్ హీరో రిషభ్‌పంత్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రికార్డును అధిగమించాడు. ధోనీ 32 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు సాధించగా, పంత్ 27 ఇన్నింగ్స్‌లలోనే ఆ ఘనత సాధించాడు.


బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో పంత్ అదరగొట్టాడు.  ఫలితంగా చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం భారత్‌ను వరించింది. భారత్‌కు ఇది నిజంగా అద్వితీయ విజయం. గబ్బాలో ఇప్పటి వరకు ఓటమన్నదే ఎరుగని ఆసీస్‌కు భారత జట్టు ఆ రుచేంటో చూపించింది.


ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ కంటే ముందే ఐదో నంబరులో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ విజయంపైనే కన్నేశాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 328 పరుగుల విజయ లక్ష్యంపైనే దృష్టిసారించిన పంత్ అద్వితీయ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 89 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. సిడ్నీ టెస్టులో మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్జుకున్న పంత్ ఈసారి కసితో ఆడి తానేంటో నిరూపించుకున్నాడు.  

Updated Date - 2021-01-19T21:49:41+05:30 IST