ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజం ధరలు పెంపు

ABN , First Publish Date - 2021-05-13T05:30:00+05:30 IST

ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజం ధరలను పెంచింది. నాణ్యమైన గ్రేడ్‌ (లంప్‌) టన్ను ధరను రూ.7,650కు, తక్కువ రకం (ఓర్‌ ఫైన్స్‌) ధరను

ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజం ధరలు పెంపు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజం ధరలను పెంచింది. నాణ్యమైన గ్రేడ్‌ (లంప్‌) టన్ను ధరను రూ.7,650కు, తక్కువ రకం (ఓర్‌ ఫైన్స్‌) ధరను రూ.6,560కు సవరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త ధరలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయి. గత నెలలో లంప్‌ ఇనుప ఖనిజం ధరను రూ.6,950గా, ఫైన్స్‌ టన్ను ధరను రూ.5,060 ప్రకటించింది.


ఉక్కు తయారీలో ఇనుప ఖనిజం ప్రధాన ముడి సరుకు కావడం వల్ల దాని ధరల్లో మార్పులు ఉక్కు ధరలపై ప్రభావాన్ని చూపుతాయి. దేశంలో ఉక్కు తయారీదారులకు ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజాన్ని సరఫరా చేస్తోంది. ఇటీవల ఉక్కు కంపెనీలు హాట్‌ రోల్డ్‌ కాయిల్‌ (హెచ్‌ఆర్‌సీ) టన్ను ధరను రూ.4,000 పెంచి రూ.67,000గా ప్రకటించాయి. కోల్డ్‌ రోల్డ్‌ కాయిల్‌ ధరలను టన్నుకు రూ.4,500 మేరకు పెంచి రూ.80,000గా నిర్ణయించాయి. 

Updated Date - 2021-05-13T05:30:00+05:30 IST