Abn logo
Mar 2 2021 @ 22:50PM

ఇంటర్‌ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు మోడల్‌ స్కూల్‌ పరిశీలన

సీతారామపురం, మార్చి 2 : సీతారామపురంలో స్ధానిక ఇంటర్‌ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ఏపీ మోడల్‌ స్కూల్‌ భవనంలోని తరగతి గదులు, ల్యాబ్‌ను మంగళవారం ఆర్‌ఐవో మాల్యాద్రి చౌదరి పరిశీలించారు. ఇంటర్మీడియేట్‌ పరీక్ష కేంద్రం స్ధానికంగా ఏర్పాటు చేయాలని పలు ఫిర్యాదులు అందిన తరుణంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్‌ఐవో మోడల్‌ స్కూల్‌ను సందర్శించారు. విశాలమైన తరగతి గదులు, అనువైన ల్యాబ్‌ సాకర్యం ఉన్నందున మోడల్‌స్కూల్లోనే ఇంటర్మీడియేట్‌ ప్రాక్టికల్స్‌తోపాటు, థీయరీ పరీక్షలు నిర్వహించేందుకు ఇక్కడే పరీక్ష కేంద్రం మంజూరుకు ఇంటర్‌ బోర్డుకు నివేదిక పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈసీ మెంబర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్‌ రెహెమాన్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement