Rinku Singh: ఊరుకో రింకూ.. నీ తప్పేముంది.. KKR ఓటమితో Rinku Singh కంటతడి

ABN , First Publish Date - 2022-05-19T19:47:41+05:30 IST

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపు అంచుల దాకా వచ్చిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఉత్కంఠ పోరులో ఓటమి పాలైంది. ఆ గెలుపు అంచుల దాకా రావడానికి..

Rinku Singh: ఊరుకో రింకూ.. నీ తప్పేముంది.. KKR ఓటమితో Rinku Singh కంటతడి

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపు అంచుల దాకా వచ్చిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఉత్కంఠ పోరులో ఓటమి పాలైంది. ఆ గెలుపు అంచుల దాకా రావడానికి కారణం కూడా 24 ఏళ్ల యువ ఆటగాడు రింకూ సింగ్. యూపీకి చెందిన ఈ చిచ్చరపిడుగు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఓడిపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన జట్టు ఓటమిపై బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. Unforgettable Innings ఆడిన రింకూ సింగ్ KKR జట్టును గెలిపించేందుకు ఎంతో ప్రయత్నించాడు. ‘ఇంకేముంది.. గెలిచేసినట్టే’ అనే సమయానికి KKR జట్టు రింకూ సింగ్ వికెట్‌ను కోల్పోయింది. ఫలితంగా.. కోల్‌కత్తా జట్టు ఓడి ఈ టోర్నీ నుంచే నిష్క్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. రింకూ సింగ్ అంతలా బాధపడి కంటతడి పెట్టుకోవడానికి కారణం లేకపోలేదు.



ఒక్క ఓవర్‌కు 21 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో రింకూ సింగ్ బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. స్టోనిస్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. మొదటి బంతి బౌలింగ్ చేయగా రింకూ సింగ్ ఆ బంతిని ఫోర్‌ కొట్టాడు. రెండు, మూడు బంతులకు వరుసగా సిక్స్‌లు బాదేశాడు. 3 బంతులకు 5 పరుగులు చేయాలి. రింకూ సింగ్ మంచి దూకుడుగా ఆడుతున్నాడు. మూడు బంతుల్లో ఇంకో సిక్స్ కొడతాడని, లేదా ఫోర్ కొట్టి మిగిలిన రెండు బంతుల్లో సింగిల్ తీసుకున్నా మ్యాచ్ KKR గెలుస్తుందని అంతా భావించారు. కొందరేమో సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి వస్తుందేమోనని అంచనా వేశారు. లక్నో ఫ్యాన్స్ మాత్రం నిరాశగా ఇక మ్యాచ్ KKRదే అన్నట్టుగా ముభావంగా కనిపించారు. 19వ ఓవర్ నాలుగో బంతికి రింకూ సింగ్ షాట్‌కు యత్నించినప్పటికీ రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. మరో రెండు బంతులే మిగిలి ఉన్నాయి. రెండు బంతుల్లో మూడు పరుగులు చేయాలి. స్టోనిస్ ఐదో బంతి బౌలింగ్ చేశాడు. రింకూ సింగ్ భారీ షాట్ కొట్టాడు.



కానీ.. లెవిస్ అద్భుతంగా ఆ బంతిని ఒంటి చేత్తో క్యాచ్‌గా పట్టాడు. ఒక్కసారిగా కేకేఆర్ ఫ్యాన్స్‌లో నిరాశ. లక్నో ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. రింకూ సింగ్ 15 బంతుల్లో 40 పరుగులు చేసి బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్ బాట పట్టాడు. ఒక్క బంతికి మూడు పరుగులు చేయాలి. రెండు పరుగులు చేసినా మ్యాచ్ డ్రా అయి సూపర్ ఓవర్ పడే ఛాన్స్ ఉంటుంది. ఉమేష్ యాదవ్ క్రీజులోకొచ్చాడు. స్టోనిస్ 20వ ఓవర్‌లో ఆరో బంతి బౌలింగ్ చేశాడు. ఆ బంతికి ఉమేష్ యాదవ్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో.. దాదాపు గెలిచే మ్యాచ్‌ను కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు చేజార్చుకుంది. రస్సెల్ చెత్త ఆట తీరు కూడా కేకేఆర్ ఓటమికి మరో కారణం. మంచి హిట్టర్‌గా పేరున్న రస్సెల్ 11 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. రస్సెల్ కాస్త మెరుగ్గా ఆడి ఉన్నా KKR జట్టుకు ఈ పరిస్థితి వచ్చేది కాదు.

Updated Date - 2022-05-19T19:47:41+05:30 IST