Abn logo
Jun 19 2021 @ 23:20PM

రిమ్స్‌ వైద్యుల ఉదారత

కడప (సెవెన్‌రోడ్స్‌), జూన్‌ 19 : పెట్రోలు దాడి జరిగి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న వనిపెంటకు చెందిన నాని, అతడి తల్లి మేరీకి వైద్యులు రూ.50 వేలు నగదు అందించారు. కడప సర్వజన ఆసుపత్రిలో రక్తనిధి విభాగ బాధ్యులు డాక్టర్‌ గురవ య్య ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ చందాల రూపంలో సుమారు రూ.50 వేలు సేకరించి ఈ మొత్తాన్ని శనివారం ఆసుపత్రిలో బాధితుడి తల్లికి అం దించారు. కార్యక్రమంలో కేవీ రమణ, డాక్టర్లు గురవయ్య, ఆనంద్‌కుమార్‌, డీఈఈ వేణుగోపాల్‌, ఏఈఈ బాలరాజశేఖర్‌ పాల్గొన్నారు.