45వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

ABN , First Publish Date - 2020-10-31T06:19:56+05:30 IST

ముద్విన్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 45వ రోజుకు చేరాయి.

45వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

కడ్తాల్‌ : ముద్విన్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 45వ రోజుకు చేరాయి. దీక్షల్లో మండల సాధన సమితి నాయకులు ఈర్లపల్లి శేఖర్‌, ఈర్లపల్లి యాదయ్య, వినోద్‌, రాశిక వెంకటయ్య, గంట సురేశ్‌, తేజ్‌, సత్యం, మల్లేశ్‌, రాజు, జోగు మహేశ్‌, కావటి లక్ష్మయ్య, గోపాల్‌రెడ్డి, రంగారెడ్డి, బందయ్య, రమేశ్‌, పెంటయ్య కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. గత నెల 16వ తేదీ నుంచి రిలే దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో జేఏసీ నాయకులు సమావేశమై ఉద్యమం తీవ్రతకు, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు నిర్ణయించారు. మండల కేంద్రంగా ప్రకటించే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని నాయకులు ఈర్లపల్లి యాదయ్య, నక్కపోతు యాదయ్య, బెల్లంకొండ యాదయ్య, వినోద్‌, రాజు, గోపాల్‌, రమేశ్‌, తదితరులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-31T06:19:56+05:30 IST