రిలయన్స్‌ ‘మీడియా’ వ్యాపారాల పునర్‌ వ్యవస్థీకరణ

ABN , First Publish Date - 2020-02-22T06:55:32+05:30 IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) తన మీడియా, డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాలను పునర్‌ వ్యవస్థీకరిస్తోంది. ఇందులోభాగంగా ఈ వ్యాపారాలన్నిటినీ ‘

రిలయన్స్‌ ‘మీడియా’ వ్యాపారాల పునర్‌ వ్యవస్థీకరణ

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) తన మీడియా, డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాలను పునర్‌ వ్యవస్థీకరిస్తోంది. ఇందులోభాగంగా ఈ వ్యాపారాలన్నిటినీ ‘నెట్‌వర్క్‌18’ పేరుతో ఒకే గొడుగు కిందికి తెస్తోంది. దీంతో రిలయన్స్‌ నిర్వహణలోని వినోద చానల్స్‌ ‘సోనీ’ కంపెనీలో విలీనమయ్యే అవకాశాలు సన్నగిల్లినట్టే. గత ఏడాది కొనుగోలు  చేసి న కేబుల్‌ టీవీ, బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీలు హాత్‌వే, డెన్‌ నెట్‌వర్క్‌లనూ పునర్‌ వ్యవస్థీకరించటంలో భాగంగా నెట్‌వర్క్‌18 అనుబంధ కంపెనీలుగా మార్చింది. రిలయన్స్‌ జియో పబ్లిక్‌ ఇష్యూకు ముందస్తు చర్యగా ఆర్‌ఐఎల్‌ ఈ చర్యలు చేపట్టిందని మార్కెట్‌ వర్గాల అంచనా వేస్తున్నాయి. 

Updated Date - 2020-02-22T06:55:32+05:30 IST