ఆర్‌ఐఎల్‌ రికార్డుల హోరు

ABN , First Publish Date - 2020-07-14T05:54:03+05:30 IST

ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌).. స్టాక్‌ మార్కెట్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉంది. సోమవారం మార్కెట్లో కంపెనీ షేరు దూకుడుగా ముందుకు సాగటంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఏకంగా...

ఆర్‌ఐఎల్‌ రికార్డుల హోరు

  • రూ.12,26,231 కోట్లకు మార్కెట్‌ క్యాప్‌ 
  • ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 51 వ స్థానం 

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌).. స్టాక్‌ మార్కెట్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉంది. సోమవారం మార్కెట్లో కంపెనీ షేరు దూకుడుగా ముందుకు సాగటంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఏకంగా రూ.12 లక్షల కోట్ల మార్కును అధిగమించింది .బీఎ్‌సఈలో మార్కె ట్‌ హెవీ వెయిట్‌ స్టాక్‌ అయిన ఆర్‌ఐఎల్‌ సోమవారం ఇంట్రాడేలో 3.64 శాతం లాభంతో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థా యి రూ.1,947.30ని తాకటంతో మార్కెట్‌ వాల్యుయేషన్‌ ఏకంగా రూ.35,373.88 కోట్లు పెరిగి రూ.12,26,231.01 కోట్లకు చేరింది. దీంతో భారతీయ స్టాక్‌ మార్కెట్లో రూ.12 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సాధించిన తొలి కంపెనీగా రికార్డు సృష్టించింది.


ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బీఎ్‌సఈలో ఆర్‌ఐఎల్‌ షేరు 2.97 శాతం లాభంతో రూ.1,934.30 వద్ద క్లోజవగా ఎన్‌ఎ్‌సఈలో 3.22 శాతం లాభపడి రూ.1,938.70 వద్ద ముగిసింది.  బీఎ్‌సఈలో 15.73 లక్షల షేర్లు ట్రేడవగా ఎన్‌ఎ్‌సఈలో 3 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. మరోవైపు మార్కెట్‌ క్యాప్‌ పరంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఆర్‌ఐఎల్‌ 51వ స్థానంలో నిలిచింది. కాగా ఆసియా రీజియన్‌లో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకోవటం ద్వారా టాప్‌-10 జాబితాలో నిలిచింది. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఆర్‌ఐఎల్‌ షేరు 27.75 శాతం మేర లాభపడటం విశేషం. 


Updated Date - 2020-07-14T05:54:03+05:30 IST