లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : ఆర్డీవో

ABN , First Publish Date - 2022-07-07T05:22:33+05:30 IST

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రాయచోటి రెవెన్యూ డివిజనల్‌ అధికారి రంగస్వామి హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో డివిజన్‌ స్థాయి పీసీపీ ఎన్డీటీ చట్టం అమలు కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల నిష్పత్తి తక్కువుగా ఉన్న మండలాలపై దృష్టి కేంద్రీకరించాలని, స్కానింగ్‌ కేంద్రాల్లో ఫీజుల వివరాలు తెలియజేసే పట్టిక ఉంచాలని సూచించారు.

లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు : ఆర్డీవో
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో

రాయచోటిటౌన్‌, జూలై 6: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రాయచోటి రెవెన్యూ డివిజనల్‌ అధికారి రంగస్వామి హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో డివిజన్‌ స్థాయి పీసీపీ ఎన్డీటీ చట్టం అమలు కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల నిష్పత్తి తక్కువుగా ఉన్న మండలాలపై దృష్టి కేంద్రీకరించాలని, స్కానింగ్‌ కేంద్రాల్లో ఫీజుల వివరాలు తెలియజేసే పట్టిక ఉంచాలని సూచించారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌వో మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ స్కానింగ్‌ కేంద్రాలు, ఆసుపత్రుల్లో అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించాలని పరిశుభ్రత, కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ విష్ణు, డిప్యూటీ డెమో దేవశిరోమణి, అడ్వకేట్‌ రెడ్డెప్పరెడ్డి, వీఆర్‌డీఎస్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ బలరామరాజు, సూపర్‌వైజర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, బాషా పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:22:33+05:30 IST