హక్కులు హరించిపోతున్నాయి: ఎమ్మెల్యే గోరంట్ల

ABN , First Publish Date - 2021-01-27T05:48:01+05:30 IST

రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు స్వేచ్ఛా రాష్ట్రంలో హరించిపోతున్నాయని, రాష్ట్రంలో రాజ్యాంగ రక్షణ కావాలని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు.

హక్కులు హరించిపోతున్నాయి: ఎమ్మెల్యే గోరంట్ల

కడియం, జనవరి 26: రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు స్వేచ్ఛా రాష్ట్రంలో హరించిపోతున్నాయని, రాష్ట్రంలో రాజ్యాంగ రక్షణ కావాలని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా కడియం దళితవాడలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాణానికి, నిమ్నజాతుల అభివృద్ధికి, సామాజిక అసమానతలు తొలగించడానికి, నవసమాజ నిర్మాణానికి అంబేద్కర్‌ చేసిన సేవలను జ్ఞాపకం చేసుకున్నారు. ఈ సందర్భం గా గోరంట్ల మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగం ధిక్కారానికి గురవుతుండడం బాధాకరమన్నారు. రాజ్యాంగ పరిధిలో ఏమైనా దోషాలు దొర్లితే అది రాజ్యాంగ లోపం కాదని, కచ్ఛితంగా మానవ తప్పిదమేనన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ రక్షణకు ప్రతీఒక్కరు నడుం బిగించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి సత్యప్రసాద్‌, వెలుగుబంటి నాని, నేలపూడి కింగ్‌మోజెస్‌, జల్ది కృపారావు, బొర్సు వెంకటేశ్వరరావు, పంతం సూర్యనారాయణ, మార్గాని ఏడుకొండలు, కనికెళ్ళ బుల్లియ్య, అల్లు సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:48:01+05:30 IST