పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాలి

ABN , First Publish Date - 2022-08-11T06:11:21+05:30 IST

దశాబ్దాల కాలంగా పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి కోరారు.

పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాలి
భీమ్లాతండాలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి

 మఠంపల్లి, ఆగస్టు 10: దశాబ్దాల కాలంగా పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి కోరారు. మండలంలోని భీమ్లాతండా, భోజ్య తండాలో శాగంరెడ్డి జగన్మోహనరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు భూముల సమస్యను సీఎం కేసీఆర్‌  మర్చిపోయారని అన్నారు. ఎంతో వివాదాస్పదమైన గుర్రంబోడుసర్వే నెం.540లో భూవివాదాన్ని అధికారులు నేటి వరకు పరిష్కరించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. భూము లను సాగు చేసుకుంటున్న గిరిజనులపై పోలీసులు దాడి చేయడం బాధాకర మన్నారు. బాధితులకు న్యాయం చేసేంతవరకు వారి పక్షాన తమ పోరాటం ఆగదన్నారు. ఆదివాసీ గిరిజనులకు న్యాయం జరిగే వరకు పార్టీ వారికి అండగా ఉండి పోరాడుతుందన్నారు. భీమ్లా తండా, భోజతండా గ్రామా ల్లోని గిరిజన రైతుల దుస్థితి, పోడు భూముల సమస్యలపై సమీక్ష నిర్వ హించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్య పాండునాయక్‌, మాలోతు బాలునాయక్‌, నాయకులు సయ్యద్‌ రన్‌మియా, ఆర్‌.వినోద్‌, కె.వెంకటేశ్వర్లు, జాల తిరుపతయ్య, భూక్య శంభయ్య, పొదిలసైదులు, డి.హరి, వాలిబాయి పాల్గొన్నారు. 



రాష్ట్రంలో బీజేపీ అధికారమే లక్ష్యం

గరిడేపల్లి, పాలకవీడు ఆగస్టు 10:  రాబోయే ఎన్నికల్లో తెలంగా ణలో  బీజేపీకి అధికారమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయా లని ఆ పార్టీ  రాష్ట్ర నాయకులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కోరారు. బుధవారం గరిడేపల్లి, పాలకవీడు మండలాల్లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  బూత్‌ కమిటీల ద్వారా బలోపేతం కావాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూల పవ నాలు ఉన్నాయన్నారు. ఈనెల 13న నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీలో పాల్గొనాలని కోరారు. ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కోరారుకార్యక్రమంలో బీజేపీ గరిడేపల్లి మండల అధ్యక్షుడు అందె కోటయ్య, సోమయ్య, వెంకటేశ్వర్లు, చంద్ర శేఖర్‌,  వేముల శేఖర్‌రెడ్డి, గున్‌రెడ్డి విజయ్‌భాస్కర్‌రెడ్డి, కొత్తూరు వెంకటేశ్వర్లు, మందా చినలాజరు, కొత్తపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T06:11:21+05:30 IST