నిరసనకారులపై టియర్ గ్యాస్.. ట్రంప్‌పై ఫిర్యాదు!

ABN , First Publish Date - 2020-06-06T03:29:31+05:30 IST

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి పట్ల నిరసనలు చెలరేగుతున్నాయి.

నిరసనకారులపై టియర్ గ్యాస్.. ట్రంప్‌పై ఫిర్యాదు!

వాషింగ్టన్: అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి పట్ల నిరసనలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ముందు కొందరు నిరసనకారులు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో పాక్షికంగా తగలబడిన ఓ చర్చిని సందర్శించాలని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భావించారు. దాంతో శ్వేతసౌధం అధికారులు నిరసనకారులపై టియర్‌గ్యాస్ దాడి చేశారు. దీనిపై మానవహక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ట్రంప్, ఇతర అధికారులకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాయి. రాజ్యాంగబద్ధంగా నిరసన చేసే వారిపై ఇలా దాడి చేయడం ద్వారా ట్రంప్ చట్టాన్ని ఉల్లంఘించారని ఈ ఫిర్యాదులో మానవహక్కుల సంఘాలు పేర్కొన్నాయి.

Updated Date - 2020-06-06T03:29:31+05:30 IST