Advertisement
Advertisement
Abn logo
Advertisement

హక్కులతో పాటు బాధ్యతలు నిర్వర్తించాలి

ముమ్మిడివరం, డిసెంబరు 3: ప్రతిపౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవిస్తూ బాధ్యతలను కూడా అంతే సక్రమంగా నిర్వర్తించాలని ముమ్మిడివరం జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన న్యాయవిజ్ఞానసదస్సులో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా లీగల్‌ రిటైనర్‌ వడ్డి నాగేశ్వరరావు సమకూర్చిన కిట్లను మానసిక వికలాంగులకు మేజిస్ట్రేట్‌ శ్రీనివాస్‌ అందజేశారు.  దాసరి సత్యనారాయణ, కేఎల్‌వీ ప్రసాద్‌, ఎం.ఆలీహసన్‌, వి.శారదాదేవి, ఆర్‌ఐటీ టీచర్‌ ఆర్‌.రమాదేవి, పోలీసు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement