రూట్‌పై రైట్‌.. రైట్‌?

ABN , First Publish Date - 2020-10-24T08:40:09+05:30 IST

తెలుగు రాష్ర్టాల మధ్య దసరా సందర్భంగా బస్సులు లేకపోవటం, రెండు రాష్ర్టాల ప్రభుత్వ పంతాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన ‘కస్సు బస్సులు’

రూట్‌పై రైట్‌.. రైట్‌?

1.61 లక్షల కి.మీ.లకు ఓకే

‘ఆంధ్రజ్యోతి’ కఽథనం తర్వాత    తెలంగాణ నుంచి తొలి స్పందన

విజయవాడ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల మధ్య దసరా సందర్భంగా బస్సులు లేకపోవటం, రెండు రాష్ర్టాల ప్రభుత్వ పంతాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన ‘కస్సు బస్సులు’ కథనం నేపథ్యంలో తెలంగాణ తొలిసారి సానుకూలంగా స్పందించింది. ఏపీఎ్‌సఆర్‌టీసీ సూచించినట్టు లక్ష కిలోమీటర్లు తగ్గించుకోడానికి అంగీకరించింది. 1.61 లక్షల కిలోమీటర్ల మేరే పరస్పరం తిప్పుకునేలా అగ్రిమెంట్‌ చేసుకుందామని తెలిపింది. ఈ విషయంలోనే ఇప్పటిదాకా పీటముడి బిగిసిన విషయం తెలిసిందే. అలా అంటూనే తిప్పేరూట్ల విషయంలో తెలంగాణ అధికారులు మెలిక పెట్టారు.


ఏపీకి తాము తిప్పే రూట్లలో 14,477 కిలోమీటర్లకు సంబంధించి స్వల్ప మార్పులు ఉంటాయని తెలిపారు. ప్రతిపాదనలను పంపిస్తామని, వాటికి సరేనంటే.. రెండు, మూడు రోజులలో ఒప్పందం చేసుకొందామని చెప్పారు. తెలంగాణ ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఇచ్చిన గ్రీన్‌ సిగ్నల్‌తో టీఎ్‌సఆర్‌టీసీ ఈడీ ఆపరేషన్స్‌ యాదగిరి ఈ మేరకు శుక్రవారం ఏపీఎ్‌సఆర్‌టీసీ ఈడీ (ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడారు. తెలంగాణ అధికారులు ఫోన్‌ చేసి సానుకూలతను వ్యక్తం చేసినప్పటికీ రూట్ల విషయంలో మెలిక పెట్టడంపై ఏపీ అధికారులు ఒకింత అసహనంతో ఉన్నారు.

అయితే, మేజర్‌ సమస్యలు దాదాపు తీరిపోయినందున.. రూట్ల మెలిక కూడా విడివడితే మంగళవారమే ఇంటర్‌ స్టేట్‌ ఒప్పందం జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.


Updated Date - 2020-10-24T08:40:09+05:30 IST