పట్టుకున్న నిందితులు, కోళ్లతో ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి
ముత్తుకూరు, జనవరి16: మండలంలో కోడిప ందేలపై ముత్తుకూరు ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి శనివారం దాడులు నిర్వహించారు. మండలంలోని పిడతాపోలూరు పంచాయతీ సోమింద మ్మపాళెంలో కోడిపందేలు ఆడుతున్నారన్న సమాచారంతో తమ సిబ్బం దితో కలిసి దాడి చేశారు. పందేల్లో పాల్గొన్న ఎనిమిది అదుపులోనికి తీసుకున్నారు. వారి నుంచి ఏడు కోడిపుంజులను, రూ.4940 నగదును స్వాధీనం చేసుకున్నారు. సంఘటనాస్థలంలో ఉన్న మూడు మోటా రుసైకిళ్లను స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. పందేల నిర్వాహకులు, ఆడుతున్న ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.