షేన్‌వార్న్‌కు నివాళి అర్పిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రికీ పాంటింగ్

ABN , First Publish Date - 2022-03-07T01:44:52+05:30 IST

రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్‌కు నివాళి అర్పిస్తూ ఆస్ట్రేలియా..

షేన్‌వార్న్‌కు నివాళి అర్పిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రికీ పాంటింగ్

సిడ్నీ: రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్‌కు నివాళి అర్పిస్తూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వార్న్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. దానిని మాటల్లో వ్యక్తీకరించడం కొంచెం కష్టమైన పనేనని అన్నాడు.


తనకు 15 ఏళ్ల ఉన్నప్పుడు ఓ అకాడమీలో వార్న్‌ను తొలిసారి కలిసినట్టు గుర్తు చేసుకున్నాడు. అతడు తనకు ఓ నిక్‌నేమ్ కూడా పెట్టాడన్నాడు. అంతేకాదు, దశాబ్దకాలంపాటు ఇద్దరం కలిసి ఆడామన్నాడు. ఈ క్రమంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశామన్నాడు.


వార్న్ తన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తాడని పాంటింగ్ గుర్తు చేసుకున్నాడు. తాను ఇప్పటి వరకు ఆడిన వారిలో అతడే అత్యుత్తమ బౌలర్ వార్నేనని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన వార్న్.. నోటి నుంచి మాటలు రావడం కష్టమై కన్నీళ్లు పెట్టుకున్నాడు. తేరుకోవడానికి కొంత సమయం పడుతుందన్నాడు. అతడితో తనకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయని పాంటింగ్ పేర్కొన్నాడు.  



Updated Date - 2022-03-07T01:44:52+05:30 IST