రూ.3కోట్ల పన్ను చెల్లించాలని రిక్షాపుల్లర్‌కు IT శాఖ నోటీసు..ఆయన ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2021-10-25T13:34:02+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలో నిరుపేద అయిన రిక్షాపుల్లర్‌కు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నోటీసు జారీ చేసిన ఘటన...

రూ.3కోట్ల పన్ను చెల్లించాలని రిక్షాపుల్లర్‌కు IT శాఖ నోటీసు..ఆయన ఏం చేశాడంటే...

మధుర (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలో నిరుపేద అయిన రిక్షాపుల్లర్‌కు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నోటీసు జారీ చేసిన ఘటన సంచలనం రేపింది. రూ.3కోట్లకు పైగా ఆదాయపు పన్ను చెల్లించాలని కోరుతూ మధురజిల్లా అమర్ కాలనీకి చెందిన ప్రతాప్ సింగ్ అనే రిక్షా పుల్లరుకు ఐటీ శాఖ నోటీసు జారీ చేసింది. దీంతో ప్రతాప్ సింగ్ ఐటీ శాఖపై మధుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిక్షాపుల్లర్ ఫిర్యాదుపై తాము ఎలాంటి కేసు నమోదు చేయలేదని, దీన్ని పరిశీలిస్తున్నామని మధుర పోలీసు అధికారి అనూజ్ కుమార్ సింగ్ చెప్పారు. మార్చి 15న తేజ్ ప్రకాష్ ఉపాధ్యాయ్ యాజమాన్యంలోని బకల్‌పూర్‌లోని జన్ సువిధ కేంద్రంలో పాన్ కార్డు కోసం తాను దరఖాస్తు చేసుకున్నానని ప్రతాప్ సింగ్ చెప్పారు. 


పాన్ కార్డును సమర్పించాల్సిందిగా తన బ్యాంక్ కోరినట్లు ఆయన తెలిపారు.అనంతరం బకాల్ పూర్ చెందిన సంజయ్ సింగ్ నుంచి పాన్ కార్డు కలర్ జిరాక్స్ ఫొటో కాపీ వచ్చింది.తనకు అక్టోబరు 19వతేదీన ఐటీ అధికారుల నుంచి తనకు ఫోన్ వచ్చిందని, ఆ ఫోనులో 3,47,54,896రూపాయల ఆదాయపు పన్ను చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారని రిక్షాపుల్లర్ చెప్పారు.వ్యాపారి ఎవరో తన పేరుపై జిఎస్‌టి నంబరు పొందారని, 2018-19లో వ్యాపారి టర్నోవర్ రూ.43,44,36,201 అని అధికారులు చెప్పారని సింగ్ చెప్పారు.తాను నిరక్షరాస్యుడినని, ఎవరో తనను మోసగించినందున ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలని ఐటీ అధికారులు తనకు సలహా ఇచ్చారని రిక్షాపుల్లర్ చెప్పారు.


Updated Date - 2021-10-25T13:34:02+05:30 IST