ఘనంగా గోపూజ

ABN , First Publish Date - 2021-01-16T05:23:52+05:30 IST

కనుమ పండుగను పురష్క రించుకు ని పట్టణంలోని వివిధ ఆలయాల్లో గోపూజలు ఘనంగా నిర్వహించా రు.

ఘనంగా గోపూజ

ప్రొద్దుటూరు టౌన్‌, జవనరి 15: కనుమ పండుగను పురష్క రించుకు ని పట్టణంలోని వివిధ ఆలయాల్లో గోపూజలు ఘనంగా నిర్వహించారు. అగస్త్యేశ్వరస్వామి, రామేశ్వరంలోని ముక్తిరామలింగేశ్వర స్వామి, బొల్లవరంలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామ్ఙి, గీతాశ్రమం, నరసింహాపు రంలోని ఆలయాల్లో గోపూజలు ఘనంగా నిర్వహించారు. గోసంపదకు, పశువులు అభివృద్ధి చెందాలని పశువులను పూజించడం ఆచారంగా వస్తోందని గోమాతను పూజిస్తే సర్వదేవతలకు పూజలు చేసినట్లేనని పెద్దలు పేర్కొన్నారు. కార్యక్రమంలో శివాలయం ఛైర్మన్‌ రాంప్రసా ద్‌రెడ్డి, ఈవో రామచంద్రాచార్యులు, బొల్లవరం పాల మండలి అధ్యక్షులు గోన ప్రభాకర్‌రెడ్డి, ఈవో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

నారాయణాశ్రమంలో ..

ప్రొద్దుటూరు రూరల్‌, జనవరి 15: మండల పరిధిలోని ఉప్పరపల్లె గ్రామంలో గల శ్రీశ్రీ సద్గురు సమర్థనారాయణ స్వామి ఆశ్రమంలో శుక్రవారం కనుమ పర్వదినాన్ని పురష్కరించుకుని గోశాలలో గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రొద్దుటూరు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోశాలలో రామనామ భజన, హనుమాన్‌శాలీషా, పారా యణం, గోశాల ప్రదక్షణలు చేశారు. ఆశ్రమ పీఠాధిపతి గోపాలస్వామి మా ట్లాడుతూ ప్రతి ఒక్కరూ గోసేవలో పాలుపంచుకోవాలని  కోరారు.  కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకుడు నాగేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:23:52+05:30 IST