ఘనంగా ఆదిత్యుని కళ్యాణం

ABN , First Publish Date - 2021-05-08T05:08:00+05:30 IST

చైత్ర బహుళ ఏకాదశిని పురస్కరిం చుకొని శుక్రవారం అరస వల్లి సూర్యనారాయణస్వామి కల్యా ణాన్ని ఘనంగా నిర్వహిం చారు.

ఘనంగా ఆదిత్యుని కళ్యాణం
స్వామి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

గుజరాతీపేట: చైత్ర బహుళ ఏకాదశిని పురస్కరిం చుకొని శుక్రవారం అరస వల్లి  సూర్యనారాయణస్వామి కల్యా ణాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఆలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు  వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి కల్యాణం జరిపించారు. కరోనా కారణంగా భక్తులను అనుమతించలేదని ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. 



111111111111111111111111111111111111111111111111111111


విద్యుత్‌ బిల్లింగ్‌కు కొవిడ్‌ భయం

ఫ హడలెత్తుపోతున్న సిబ్బంది

ఫ జిల్లాలో ఆలస్యంగా మొదలైన ప్రక్రియ

ఇచ్ఛాపురం రూరల్‌: జిల్లాలో రోజు రోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో  విద్యుత్‌ బిల్లింగ్‌రీడర్లు రీడింగ్‌ తీసేందుకు భయాందోళన చెందుతున్నారు. విద్యుత్‌ ఒప్పంద సిబ్బందిలో పలువురికి కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో రీడింగ్‌ సిబ్బంది హడలెత్తిపోతున్నారు. దీంతో  ఒప్పంద సిబ్బందిలో ఎక్కువ మంది రీడింగ్‌ విధు లు తాము నిర్వర్తించలేమని చెబుతున్నారు. విస్తృతంగా కరోనా వైరస్‌ ప్రబ లడంతో ఇళ్లకు వెళ్లి రీడింగ్‌ తీసే సమయంలో వ్యాధి సోకే అవకాశం ఉంటుందని   ఆందోళన చెందుతున్నారు.

ఇదీ బిల్లింగ్‌ విధానం

 వాస్తవానికి ప్రతి నెలా మొదటివారంలో రీడింగ్‌ తీయాలి. ప్రస్తుతం నడుస్తున్న విధానంలో సిబ్బంది వినియోగదారుల నివాసం, దుకాణం వద్దకు వెళ్లి తమ వద్ద ఉన్న జీపీఎస్‌ అనుసంధాన స్మార్ట్‌ ఫోన్‌తో వారి విద్యుత్‌ మీటరును స్కాన్‌ చేస్తారు. తర్వాత ముందుగా నమోదైన శ్లాబ్‌ ధరల ప్రకారం విద్యుత్‌ బిల్లింగ్‌ పరికరం నుంచి  బిల్లు వస్తుంది. దానిని విని యోగదారులకు ఇస్తారు. జిల్లాలో ఈ నమోదు ప్రక్రియ కాంట్రాక్టరు ఆధ్వర్యంలోని ఒప్పంద సిబ్బంది చూస్తారు.  జిల్లాలో మొత్తం 8,23,229 గృహ, వాణిజ్య వినియోగ కనెక్షన్లు ఉన్నాయి. రీడింగ్‌ తీసే సిబ్బంది 250 మంది ఉన్నారు. వీరు ప్రతినెలా వీటి రీడింగ్‌నమోదు రెండోతేదీన మొదలవుతుంది. సిబ్బంది ఆందోళన నేపథ్యంలో  ఈనెలలో ఈప్రక్రియ ఆలస్యమైంది. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క సోంపేట మండలంలోనే బిల్లింగ్‌ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా రీడింగ్‌ తీయడం ప్రారంభిస్తామని చెబుతున్నారు.

శ్లాబు మారితే....

 బిల్లింగ్‌ ఆలస్యం కావడంతో తమ వినియోగ శ్లాబులు మారిపోతాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. శ్లాబ్‌మారితే బిల్లు పెరుగుతుందని పలువురు చెబుతున్నారు. ఇంకా బిల్లులు నమోదుచేసే సిబ్బంది రాలేదని పలువురు  వినియోగదారులు అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. 

 కర్ఫ్యూతో దుకాణాలకు ఉదయమే...

 ప్రస్తుతం జిల్లాలో కొవిడ్‌ కట్టడికి మధ్యాహ్నం 12 గంటల తర్వాత దుకాణాలు మూసి కర్ఫ్యూ విధిస్తున్నారు. దీంతో  ప్రతిరోజూ ఉదయం దుకాణాల్లో రీడింగ్‌ నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు.మధ్యాహ్నం తర్వాత గృహ  విద్యు త్‌ వినియోగదారుల రీడంగ్‌ తీయనున్నారు. సాధారణంగా ప్రతి నెలా రెండు  నుంచి 15వ తేదీ వరకు బిల్లుల  రీడింగ్‌ తీయాలి. ఈసారి సిబ్బంది సమస్యలు, పాక్షిక లాక్‌డౌన్‌తో ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

బిల్లులు పెరుగుతాయనే భయం వద్దు 

 విద్యుత్‌ బిల్లుల నమోదు ఆలస్యంగా మొదలైనా మాట వాస్తవమే. 400 యూనిట్లకు పైబడి విద్యుత్‌ను అధికంగా వాడే అతి కొద్దిమందికి మాత్రమే బిల్లులు కొంత అధికంగా వచ్చే అవకాశంఉంది.  కాని ఇతరులపై ఈ ప్రభావం ఉండదు. బాగా ఎక్కువ బిల్లు వచ్చిందనుకున్న వారు విద్యుత్‌ కార్యాలయాల్లో సంప్రదిస్తే వాటిని సరిచేస్తాం. 

- ఎం.రాజేంద్రప్రసాద్‌, ట్రాన్స్‌కో ఏడీఈ, సోంపేట


 మీటరు రీడింగ్‌ నమోదు చేస్తున్న సిబ్బంది(ఫైల్‌ ) 7ఐసిపి(ఆర్‌) 01.


Updated Date - 2021-05-08T05:08:00+05:30 IST