Jul 6 2021 @ 17:10PM

‘సూపర్‌మ్యాన్‌’ సిరీస్‌ సృష్టికర్త ఇకలేరు!

‘సూపర్‌మ్యాన్‌’ సిరీస్‌ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన దర్శకుడు రిచర్డ్‌ డొనాల్డ్‌ స్వ్కార్జ్‌బర్గ్‌ (91) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. 1931లో న్యూయార్క్‌లో పుట్టిన ఆయన నటుడు కావాలని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అనుకోకుండా బుల్లితెర దర్శకుడిగా మారారు. 1957-1990 మధ్యలో 50కి పైగా సీరియళ్లు, సిరీస్‌లు తెరకెక్కించారు. 1961లో ‘ఎక్స్‌-15’ అనే చిత్రంతో ఫీచర్‌ సినిమా దర్శకుడిగా అవతారమెత్తారు. ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు. ఆ తర్వాత మూడు సినిమాలు తీసినా సరైన సక్సెస్‌ వరించలేదు. దాదాపు 15 సంవత్సరాలకి ‘ది ఒమెన్‌’ సినిమాతో విజయం అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘సూపర్‌మ్యాన్‌’ సిరీస్‌ చిత్రాలతో తిరుగులేని డైరెక్టర్‌గా ఎదిగారు. ‘ఇన్‌సైడ్‌ మూవీస్‌’, ‘ది గూనీస్‌’, ‘లెథల్‌ వెపన్‌’ సిరీస్‌లు, ‘టైమ్‌ లైన్‌’, ‘16 బ్లాక్స్‌’, ‘కాన్స్‌పిరసీ థియరీ’ తదితర చిత్రాల్ని తెరకెక్కించి పలు అవార్డులను అందుకున్నారు. పలు పుస్తకాలకు ఆయన కో రైటర్‌గా పనిచేశారాయన.