Abn logo
Sep 22 2020 @ 10:11AM

మీ పోరాటం కోసం నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తారా: హీరోయిన్ రిచా

Kaakateeya

ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని న‌టి పాయ‌ల్ ఘోష్ చేసిన ఆరోప‌ణ‌లు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. త‌న‌కు న్యాయం చేయాలని కోరుతూ ఏకంగా ప్ర‌ధాని మోదీని పాయల్ ట్యాగ్ చేయ‌డం మరింత సంచలనంగా మారింది. అనురాగ్‌పై ఆరోపణలు చేస్తూ హీరోయిన్ రిచా చద్దా పేరును పాయల్ ప్రస్తావించింది. రిచాతోపాటు మరో ఇద్దరు హీరోయిన్లకు తనతో లైంగిక సంబంధాలున్నాయని అనురాగ్ చెప్పినట్టు పాయల్ వెల్లడించింది. 


తనకు సంబంధం లేని వివాదంలోకి తన పేరు లాగడంపై హీరోయిన్ రిచా చద్దా ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పేరును వాడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఈ మేరకు ఆమె లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు. `అనురాగ్‌పై లైంగిక ఆరోపణల చేస్తూ మూడో వ్యక్తి అనవసరంగా నా క్లయింట్‌ రిచా చద్దా పేరు ప్రస్తావించారు. ఆమె పేరును అవమానకర రీతిలో వాడారు. ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేశారు. అనవసర వివాదంలోకి తన పేరు లాగి ఆత్మగౌరవాన్ని దెబ్బ‌తీశారు. తను చేస్తున్న పోరాటం కోసం మరో మహిళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. దీనిపై న్యాయ పోరాటానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామ`ని పేర్కొన్నారు.



Advertisement
Advertisement
Advertisement