ఘనంగా సంక్రాంతి వేడుకలు

ABN , First Publish Date - 2022-01-17T04:01:39+05:30 IST

జిల్లాలో శనివారం సంక్రాంతి పర్వదినాన్ని, ఆదివారం కనుమ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఆసిఫాబాద్‌జిల్లా కేంద్రంలో వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో పతంగుల పండగను నిర్వ హించారు. పట్టణంలోని హోలీ ట్రీనిటీ స్కూల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పతంగుల పండుగలో చిన్నా రులకు పతంగులను పంపిణీ చేశారు. అనంతరం కన్యకాపరమేశ్వరి ఆలయంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు.

ఘనంగా సంక్రాంతి వేడుకలు
బాబాపూర్‌లో ఎడ్లపోటీలు

ఆసిఫాబాద్‌, జనవరి 16: జిల్లాలో శనివారం సంక్రాంతి పర్వదినాన్ని, ఆదివారం కనుమ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఆసిఫాబాద్‌జిల్లా కేంద్రంలో వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో పతంగుల పండగను నిర్వ హించారు. పట్టణంలోని హోలీ ట్రీనిటీ స్కూల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పతంగుల పండుగలో చిన్నా రులకు పతంగులను పంపిణీ చేశారు. అనంతరం కన్యకాపరమేశ్వరి ఆలయంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. అదేవిధంగా మండలంలోని బాబా పూర్‌, ఈదులవాడ, కొమ్ముగూడ, గొల్లగూడ, చిర్ర కుంట గ్రామాల్లో శనివారం సంక్రాంతి పండగను పురస్క రించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్‌ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే బాబాపూర్‌ గ్రామంలో ఎడ్లబండి పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, సర్పంచ్‌ భీమేష్‌, నాయకులు జి శ్రీనివాస్‌, పెంటయ్య, సురేష్‌, ప్రభాకర్‌, శంకర్‌, మధు కర్‌, దేవబ్రహ్మం, వాసవీక్లబ్‌ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు వెంకన్న, శ్రీనివాస్‌, బాలేశ్వర్‌, శ్రీనివాస్‌, రవీందర్‌, అభిలాష్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌: పట్టణంలో శనివారం సంక్రాంతి పండుగ వేడుకలను పట్ణణవాసులు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు నోములు నోచుకున్నారు. పండుగ సందర్భంగా మహిళలు తమ ఇళ్ల ముందు రకరకాల రంగులతో ముగ్గులు వేశారు. దూర ప్రాంతాల్లోని విద్యార్థులు తమ స్వస్థలాలకు చేరుకోవడంతో అంతా సందడిగా మారింది.

సిర్పూర్‌(యూ)/ వాంకిడి: మండలా ల్లోని ఆయా గ్రామాల్లో శనివారం సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు తమ వాకిళ్లను రంగుల రంగుల ముగ్గులతో తీర్చిదిద్దారు. ఇళ్లను శాభాయమానంగా తీర్చిదిద్దారు. పండుగను పురష్కరించుకొని మహిళలు పండి వంటలు చేశారు. ఈ సంద ర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. విద్యార్థులు, యువకులు గాలిపటాలను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. పండుగ సందర్భంగా బంధువుల రాకతో ఇళ్లల్లో సందడినెలకొంది.

బెజ్జూరు/ సిర్పూర్‌(టి)/ రెబ్బెన/ దహెగాం/ కెరమెరి: మండలాల్లో సంక్రాంతి పండగను శని, ఆదివారాలు ఘనంగా జరు పుకున్నారు. ఈ సందర్భంగా ఇళ్ల ముందు రంగు రంగుల రంగువళ్లులు, చిన్నారులు పతంగులతో సంబరాలను ఆనందోత్సవాలను జరుపు కున్నారు. ఆదివారం కనుమ సందర్భంగా మహిళలు సంక్రాంతి నోములు నోముకున్నారు. ఎల్కపల్లి సమీపంలో చెరుకు, పసుపు తోటల్లో కొబ్బరి చెట్లు వద్ద మహిళలు నోములు నోచుకుని ఒకొకరికొకరు ఇచ్చుకున్నారు. సిర్పూర్‌(టి)లో మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి, సాయిబాబా, హనుబాన్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆకట్టుకున్న ముగ్గు

పండుగ జరుపుకోవడానికి పేద, ధనిక భేదం ఉండదు. ఎంత పేదవారైనా తమ తాహతుకు తగ్గట్టుగా పండుగను చేసుకుని ఆనందంగా ఉంటారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కాగజ్‌నగర్‌ బస్టాండ్‌ సమీపంలో ఒక సంచార చిరువ్యాపారి కుటుంబం తనగుడిసె ముందు అలుకుచల్లి అందంగా ముగ్గువేసి సంక్రాంతి పండుగ సంప్రదాయాన్ని చాటారు. భావిత రాలకు పండుగ స్ఫూర్తిని చాటారు. పేదవారైనా సొంతగూడు లేకున్నా ఉన్నా గుడిసెముందు ముగ్గువేసి ఆదర్శంగా నిలిచారు.                                   

- కాగజ్‌నగర్‌

Updated Date - 2022-01-17T04:01:39+05:30 IST