చాణక్యనీతి: డబ్బు ఉందని జీవితంలో ఇలాంటి తప్పులు చేయకండి.. లేదంటే..

ABN , First Publish Date - 2022-05-11T12:45:55+05:30 IST

చాణక్య నీతి ప్రకారం డబ్బులు కావాలనే కోరిక...

చాణక్యనీతి: డబ్బు ఉందని జీవితంలో ఇలాంటి తప్పులు చేయకండి.. లేదంటే..

చాణక్య నీతి ప్రకారం డబ్బులు కావాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆచార్య చాణక్యుడు లక్ష్మిని సంపదకు దేవతగా అభివర్ణించాడు. జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బుకు లోటు ఉండదు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. గౌరవం కూడా పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు డబ్బు వచ్చినప్పుడు, వ్యక్తి స్వభావంలో మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి డబ్బు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతారు. డబ్బు గర్వంతో మనిషి ఎటువంటి పనలు చేయకూడదో ఆచార్య చాణక్య తెలిపారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.


బలహీనులను వేధించొద్దు 

చాణక్య నీతి ప్రకారం మనిషి తన పదవి, ప్రతిష్టలను తప్పుగా ఉపయోగించుకుని బలహీనులను అవమానించి, వారి హక్కులను హరించకూడదు. లక్ష్మీదేవికి అలాంటి వారంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇటువంటి పరిస్థితిలో వారు ఇబ్బందులు పడుతూ, వైఫల్యాన్ని పొందుతారు.

అత్యాశ వద్దు 

చాణక్య నీతి ప్రకారం, ఏ వ్యక్తి కూడా ఇతరుల డబ్బు కోసం ఆశ పడకూడదు. జీవితంలో కష్టపడితేనే డబ్బు వస్తుంది. కష్టపడకుండా వచ్చే డబ్బు ఎక్కువ కాలం మన దగ్గర ఉండదు. అత్యాశ కలిగినవారు సంతృప్తి చెందలేరు. అత్యాశ కారణంగా మనిషిలో అనేక లోపాలు చోటుచేసుకుంటాయి. అత్యాశ కలిగిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు.

చెడు సహవాసాన్ని వెంటనే వదిలేయండి

చాణక్య విధానం ప్రకారం చెడు సహవాసం ఎల్లప్పుడూ హానిని కలిగిస్తుంది. దీనివల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. చాణక్య విధానం ప్రకారం, ఎవరైనా సరే పండితులతో, వేదాలపై అవగాహన ఉన్నవారితో, మతాన్ని అనుసరించేవారితో సహవాసం చేయాలి. చెడు సహవాసం కలిగినవారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. అందుకే జీవితంలో విజయం సాధించాలంటే చెడ్డ వ్యక్తుల సహవాసాన్ని వెంటనే వదిలివేయాలి.

అవసరమైనప్పుడు మాత్రమే డబ్బు ఖర్చు చేయండి 

చాణక్య నీతి ప్రకారం మనిషి పొరపాటున కూడా డబ్బును అవమానించకూడదు. లక్ష్మిదేని గౌరవించని పక్షంలో ఆ దేవత అనుగ్రహం శాశ్వతంగా దూరమవుతుంది. అందుకే డబ్బుకు తగిన గౌరవం ఇవ్వాలని ఆచార్య చాణక్య తెలిపారు. 



Read more