Abn logo
Sep 25 2021 @ 23:09PM

ఘనంగా ఆర్ఫీఎఫ్‌ రైజింగ్‌ డే

సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సెత్పతీ

ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్‌ఎం

విశాఖపట్నం, సెప్టెంబరు 25: రైల్వే రక్షణ దళం (ఆర్ఫీఎఫ్‌) రైజింగ్‌ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డివిజినల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ కార్యాలయంలో ఆర్పీఎఫ్‌ సిబ్బంది కవాతు నిర్వహించారు. అనంతరం రైజింగ్‌ డే పరేడ్‌లో పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సెత్పతీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైల్వే ఆస్తుల పరిరక్షణతోపాటు నేరాలు అరికట్టడంలో ఆర్ఫీఎఫ్‌ పాత్ర కీలకమన్నారు.

చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నియంత్రణకు ఆర్ఫీఎఫ్‌ సిబ్బంది చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు మద్దతు ఇస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీఎస్‌సీ సిహెచ్‌.రఘువీర్‌ మాట్లాడుతూ ఆర్ఫీఎఫ్‌ సేవలను కొనియారు. దేశంలోని రక్షణ దళాల్లో అత్యుత్తమ దళాల్లో ఆర్ఫీఎఫ్‌ ఒకటని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్ఫీఎఫ్‌ అధికారులు పాల్గొన్నారు.