ఘనంగా గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2022-01-27T04:59:44+05:30 IST

గణతంత్ర దినోత్సవ వేడుకలను బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాల్లో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా గణతంత్ర వేడుకలు
పులివెందులలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న ఎంపీ, ఓఎస్డీ

బద్వేలు, జనవరి26:గణతంత్ర దినోత్సవ వేడుకలను  బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో మున్సిపల్‌ కమిషనర్‌  కృష్ణారెడి జాతీయ జెండాను ఎగురవేశారు. ్డ, ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి,   రాష్ట్ర సగర చైర్‌పర్సన్‌ గానుగపెంట రమణమ్మలు పాల్గొన్నారు. అనంతరం రాచపూడినాగభూషణం డిగ్రీ, పీజీ కళాశాలలో  ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎన్‌సీసీ కేడెట్స్‌ ఆధ్వర్యంలో స్థానిక సీమాంక్‌ ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధ, కళాశాల పరిపాలనాధికారి సాయిక్రిష్ణ, ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ పాల్గొన్నారు. జూనియర్‌ సివిల్‌కోర్టు వద్ద జూనియర్‌ సివిల్‌జడ్జి,  పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో సీఐ రామచంద్ర, తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తహసీల్దార్‌ మల్లికార్జునరెడ్డ్డి, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రామకృష్ణయ్య, ఆర్టీసీ డీఫోలో డీఎం శ్రీనివాసులు  జెండాను ఎగురవేశారు. సీపీఐ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా  కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్‌ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. 

పోరుమామిళ్లలో : మండలంలో  గణతంత్ర వేడుకలను ఘనంగా  నిర్వహించారు. బుధవారం  మాజీ ఎమ్మెల్యే కమలమ్మ అర్చన ఎడ్యుకేషనల్‌ కాలేజీలో జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో పీసీసీ వైస్‌ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌, బద్వేలు ఇన్‌చార్జ్‌ కమల్‌ ప్రభా స్‌ పాల్గొన్నారు.  తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ విజయకుమారి జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ హరిప్రసాద్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో నూర్జహాన్‌ జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, కళాశాలల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. 

గోపవరంలో : గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ రమణారెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో పీఆర్‌ ఏఈ చిట్టిబాబు, రూరల్‌పోలీ్‌సస్టేషన్‌లో ఎస్‌ఐ చంద్రశేఖర్‌లు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి జాతీయ వందనం చేశారు. అలాగే మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. 

కలసపాడులో : కలసపాడు మండల వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా  నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తాహసీల్దార్‌ రామచంద్రుడు, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ రామచంద్రుడు, ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయు లు జెండా వందనం నిర్వహించారు. 

అట్లూరులో: మండల కేంద్రమైన అట్లూరు తహసిల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ఇందిరరాణీ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పొత్తపి రమాదేవి, ఎంపీడీవో సుజాతమ్మ, సచివాలయం, ఆర్‌బీకే, ఎంఈవోకారాలయం, జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో, కేజీబీవీ,పోలీసు స్టేషన్‌, సోమేశ్వరపురం, కమలకూరు జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలతో పాటు అన్ని గ్రామ సచివాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.

బి.కోడూరులో : మండలంలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మధురవాణి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో చంద్రమౌళి, పోలీ్‌సస్టేషన్‌లో ఎస్‌ఐ అస్రిన్‌, వ్యవసాయ కార్యాలయం ఎదుట ఏఓ సురే్‌షకుమార్‌రెడ్డి అన్ని గ్రామ సచివాలయాల ఎదుట పంచాయతీ సెక్రటరీలు, అన్ని పాఠశాలల్లో ప్రధానోపాఽధ్యాయులు జెండా ఎగుర వేసి విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. 

పులివెందుల/టౌన్‌లో: గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వ హించారు. పులివెందులలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్‌ అవి నాష్‌రెడ్డి పాల్గొ నగా పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి జాతీయప తాకాన్ని ఆవిష్కరించారు. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాసులు, తహ సీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మాధవకృష్ణారె డ్డి  అన్ని ప్రభుత్వ , ప్రైవేటు కార్యాలయాలు, పాఠ శాలలు, కళాశాలల్లో మువ్వన్నెల జండా రెపరెపలా డింది. లింగాల మం డల మహిళా శక్తిభవన్‌నందు ఏపీఎం ఆంజనేయులు జాతీయ జెండాను ఎగుర వేశారు. పార్నపల్లె, కోమన్నూతల, కర్ణపాపాయపల్లె, మురారిచింతల, వెలిదండ్ల గ్రామాలలో డ్వాక్రా మహిళల చేత జండాను ఆవి ష్కరించారు. 

లింగాలలో: మండలంలో బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ శేషారెడ్డి, పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ హృషికేశ్వరరెడ్డి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద సురేంద్రనాథ్‌, జడ్పీహైస్కూల్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,  వద్ద జాతీయ జండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. లింగాల  ఎంపీడీఓ సురేంద్రనాథ్‌, ఎస్‌ఐ హృషికేశ్వరరెడ్డిలు చేసిన సేవలకు గుర్తుగా కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌ల చేతులమీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు.

సింహాద్రిపురంలో: గణతంత్ర దినోత్సవ వేడుకలు బుదవారం సింహాద్రిపురంలో ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మహబూబ్‌బాషా, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ కృష్ణమూర్తి, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు పతాకావిష్కరణ కావించారు.

మైదుకూరులో : 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం మైదుకూరులో ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలతో పాటు విద్యాసంస్ధల్లో జాతీయ జెండాను ఎగురవేసి సంబరాలు నిర్వహించారు. స్థానిక జూనియర్‌ సివిల్‌  కోర్టు నందు  ఇన్‌చార్జ్‌ జడ్జి రత్నప్రసాద్‌, బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసులు విడివిడిగా జాతీయజెండాను ఎగురవేయగా న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మండల తహసీల్దారు కార్యాలయం వద్ద తహసీల్దారు ప్రేమంతకుమార్‌, ఎంపీడీవో కుళాయమ్మలు డీఎస్పీ కార్యాలయం వద్ద డీఎస్పీ విజయకుమార్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. 

చాపాడులో: మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, గ్రామ సచివాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం అధికారులు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఎంపీపీ లక్షుమయ్య, ఎంపీడీవో శ్రీధర్‌నాయుడు, తహసీల్దారు రత్నకుమారి, ఏపీఎస్‌ వెంకటరమణ, స్పెషల్‌ ఆఫీసర్‌ మల్లేశ ్వరి, ఎస్‌ఐ సుబ్బారావు, ఎంఈవో రవిశంకర్‌, గ్రామ కార్యదర్శులు, హెడ్మాస్టర్లు జెండాలను ఎగురవేశారు. 

ఖాజీపేటలో: మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.  స్థానిక దుంపలగట్టులో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, కేసీ కెనాల్‌ ప్రాజెక్టు వైస్‌ఛైర్మన్‌ రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి  గాంధీ, అంబేద్కర్‌ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పిచారు.  వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో గాంధీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేశారు.

దువ్వూరులో: గణతంత్య్ర దినోత ్సవాన్ని పురష్కరించుకుని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు దామోదర్‌రెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జగదీశ్వర్‌రెడి ్డ, ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి,  పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ కేసీ రాజు జెండావందనం గావించారు. 

బ్రహ్మంగారిమఠంలో:  మండలంలో బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిం చారు.  మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో వెంగమునిరెడ్డి, తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు లక్ష్మినారాయణ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ శ్రీనివాసులు, వెలుగు కార్యాలయంలో వెలుగు అధ్యక్షురాలు శ్యామల జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు.  కార్యక్రమంలో అధికారులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వేంపల్లెలో: మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.  మండల పరిషత్‌ కార్యాలయం వద్ద   జడ్పీటీసీ సభ్యుడు రవికు మార్‌రెడ్డి  జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీఓ మల్లికార్జునరెడ్డి, ఎంపీపీ గాయత్రి, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయంలో జండా ఆవిష్కరించారు. ఎస్‌ఐలు తిరుపాల్‌నాయక్‌, సుభా్‌షచంద్రబో్‌సలు పోలీ్‌సస్టేషన్‌లో జండాను ఎగురవేశారు. విద్యుత్‌ కార్యాలయంలో ఏఈ శ్రావణ్‌కుమార్‌ జండాను ఎగురవేశారు.  ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో డైరెక్టర్‌ సంధ్యారాణి  జెండాను ఆవిష్కరించారు.  కార్యక్రమంలో ఏఓ కొండారెడ్డి, రమణారెడ్డి, శంషాద్‌బేగం, ఓబయ్య, సెక్యూరిటీ ఆఫీసర్‌ పాల్గొన్నారు.







Updated Date - 2022-01-27T04:59:44+05:30 IST