పరేడ్‌ మైదానంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2022-01-27T06:57:19+05:30 IST

అభివృద్ధిలో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదామని కలెక్టర్‌ నాగలక్ష్మి పిలుపునిచ్చారు.

పరేడ్‌ మైదానంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
అనంతపురంలోని పరేడ్‌ మైదానంలో జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప

కలెక్టర్‌ నాగలక్ష్మి

అనంతపురం, జనవరి 26(ఆంధ్రజ్యోతి): అభివృద్ధిలో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదామని కలెక్టర్‌ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక పోలీసు పరేడ్‌ మైదానంలో 73వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు. అనంతరం సాయుధ పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలకు కలెక్టర్‌ గణతంత్ర దినోత్సవ సందేశాన్ని చదివి వినిపించారు. అంతకుముందు జిల్లాలోని అన్నివర్గాల ప్రజానీకానికి ఆమె గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  


జిల్లా ప్రగతిని వివరిస్తూ...

అక్షర క్రమంలో ముందుండే జిల్ల్లాను అన్నిరంగాల్లోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. వరుణుడి కరుణతో జిల్లాలో వర్షాలు సంమృద్ధిగా  కురిశాయి. సాధారణ వర్షపాతంకన్నా... జిల్లాలో 37.05 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. తద్వారా గతేడాది డిసెంబరు నాటికి జిల్లాలో 7.98 మీటర్ల జలమట్టం పెరిగింది. 

-  రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా నవరత్నాల్లో భాగంగా... ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 13500 అందిస్తోంది. జిల్లాలో మూడు విడతలుగా 5,76,972 కుటుంబాలకు రూ.778.92 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా 13,242 మెట్రిక్‌ టన్నుల ఎరువులను రైతులకు అందించాం. ప్రతి ఆర్‌బీకే పరిధిలో వ్యవసాయ సలహామండలి ఏర్పాటు చేసి రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నాం. 1.22 లక్షల మంది రైతులకు 2020 ఖరీఫ్‌కు సంబందించి రూ. 21.40 కోట్లు సున్నావడ్డీ పంట రుణాలు రైతుల ఖాతాల్లో జమచేశాం. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద 2020 ఖరీ్‌ఫకుగానూ 2.46 లక్షల మంది రైతులకు రూ.266.42 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. పంటనష్టం పరిహారానికి సంబంధించి గతేడాది నవంబరులో కురిసిన అధిక వర్షాలతో నష్టపోయిన 84720 మంది రైతులకు రూ.95.46 కోట్లు పరిహారం అందించేందుకు ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపాం.

- సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.17.86 కోట్లతో పండ్లతోటల విస్తరణ, రక్షిత సేద్యం, పంటకుంటలు, ఇతర ప్రోత్సహకాలు అందిస్తాం. జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా 1778 మంది లబ్ధిదారులకు రూ.13.33 కోట్లు అందించాం. జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా 995 మందికి రూ.7.46 కోట్లు అందించాం.

- హంద్రీనీవా ద్వారా లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకుగానూ చర్యలు తీసుకుంటున్నాం. హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచేందుకుగానూ రూ.6182.20 కోట్లతో ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. జీడిపల్లి జలాశయం కింద ఉన్న జీడిపల్లి గ్రామ ప్రజలకు పునరావాసం కల్పించేందుకు రూ.54.60 కోట్ల ఖర్చుతో చర్యలు చేపట్టాం. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం.

- వైఎస్సార్‌ పింఛన కానుక ద్వారా గత డిసెంబరు నాటికి 5,23,986 మందికి రూ.1140.34 కోట్లు అందించాం. వైఎస్సార్‌ చేయూత ద్వారా ఈ ఏడాది 1,93,231 మందికి రూ.362.31 కోట్లు అందించాం. ఇలా వైఎస్సార్‌ సున్నావడ్డీ, సంక్షేమశాఖల ద్వారా చేకూర్చిన లబ్ధి వైఎస్సార్‌ నేతన్న నేస్తం, జగనన్న ఉపాధి దీవెన, వైఎస్సార్‌ వాహనమిత్ర, నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు, జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప, మహిళా శిశుసంక్షేమం తదితర శాఖల ద్వారా చేకూర్చిన ప్రగతిని కలెక్టర్‌ వివరించారు.

జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తున్న జిల్లా ఇనచార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ, రోడ్లు, భవనాల శాఖమంత్రి శంకరనారాయణతోపాటు శాసనమండలి విప్‌, ప్రభుత్వ విప్‌, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు కలెక్టర్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ పక్షా లు, స్వచ్ఛంద సేవాసంస్థలు, బ్యాంకర్లు, మీడియా ప్రతినిధులు, జిల్లా ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో శాసన మండలి విప్‌ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన నదీం అహమ్మద్‌, రాష్ట్ర నాటక అకాడమీ చైౖర్‌పర్సన హరిత, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కొగటం విజయభాస్కర్‌రెడ్డి, జేసీలు సిరి, గంగాధర్‌ గౌడ్‌, పె నుకొండ సబ్‌ కలెక్టర్‌ నవీన, డీఎ్‌ఫఓ సందీ్‌పకృపాకర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూ ర్యతేజ్‌, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


ఆకట్టుకున్న శకటాలు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

అనంతపురం టౌన్‌: గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా వివిధ శాఖల శకటా ల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నా యి. తొలుత పోలీసులు ప్లటూన్ల వారీగా, ఎనసీసీ విద్యార్థులు కవాతు చేస్తూ.. జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్పకు గౌరవవందనం సమర్పించారు. అనంతరం శకటాల ప్రదర్శనలో భాగంగా దిశ పోలీసు విభాగానికి చెందిన వాహనాలు ప్రదర్శనగా ముందుకు సాగాయి. వ్యవసాయ పథకాలను ప్రదర్శిస్తూ వ్యవసాయశాఖ శకటం, ఉద్యాన, పశుసంవర్ధకశాఖ శకటాలు, నవరత్నాల్లో భాగంగా అందరికీ ఇళ్లు పేరుతో గృహనిర్మాణశాఖ శక టం, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ, ఉపాధి పనుల ఆవశ్యకతను తెలుపుతూ నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) శకటం, మహిళాభివృద్ధి-చిరువ్యాపారులకు నగదు సహకారం వంటివాటిని తెలియజేస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి(డీఆర్‌డీఏ) శకటం, ప్రజారోగ్యం మెరుగునకు చేపడుతున్న చర్యలు, జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప, కరోనా విపత్కరకాలంలో వైద్యఆరోగ్యశాఖ చేసిన కృషిని వివరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ శకటం, మనబడి... నాడు-నేడు అంటూ విద్యాశాఖల శకటాలు ఆయా శాఖలద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రదర్శనగా సాగాయి. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనల్లో కూడేరు కేజీబీవీ, కళ్యాణదుర్గం జిల్లా పరిషత ఉన్నత పాఠశాల, గార్లదిన్నె కేజీబీవీ, అనంతపురానికి చెందిన మణిపాల్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులు అలరించారు. జాతీయస్థాయిలో రాణించిన ఫెన్సింగ్‌ క్రీడాకారులు త్రివేణి - ముస్కాన, షామీర్‌ - ప్రణీత తమ విద్యా ప్రతిభను ప్రదర్శించారు. అనతరం ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ ఉద్యోగులకు, ఉత్తమ స్వచ్ఛంద సేవకులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కవాతు నిర్వహణలో ఏఆర్‌ కం టెంజెంట్ల విభాగంలో ఆర్‌ఎ్‌సఐ బాలాజీనాయక్‌ బృందం మొదటి, ఆర్‌ఎ్‌సఐ ప్రవీణ్‌కుమార్‌ బృందం ద్వితీయ, నారాయణ స్వామి బృందం తృతీయ బహుమతి అందుకున్నాయి. ఎనసీసీ విభాగంలో భరతనాయక్‌ ప్రథమ, స్వాతి ద్వితీయ, చంద్రిక బెటాలియన తృతీయ బహుమతి దక్కించుకున్నా యి. శకటాల ప్రదర్శనలో డ్వామా, పంచాయతీరాజ్‌ శాఖల శకటాలు ప్రథమ, డీఆర్‌డీఏ, మెప్మా శకటాలు ద్వితీయ, వ్యవసాయశాఖ శకటం తృతీయస్థానంలో నిలిచాయి. ఆయా శాఖల సిబ్బందికి జిల్లా కలెక్టర్‌ చేతులమీదుగా బహుమతులు అందజేశారు. విజేతలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వి ద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం ఆయా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్‌, ఎస్పీ సందర్శించారు.













Updated Date - 2022-01-27T06:57:19+05:30 IST