Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఘనంగా దసరా సంబురాలు

నిర్మల్‌ కల్చరల్‌, అక్టోబరు 16 : జిల్లా అంతటా శుక్రవారం దసరా పండుగ ప్రజలు ఆనందోత్సాహల మధ్య ఘనంగా జరుపుకున్నారు. గత ఏడాది కొవిడ్‌ కారణంగా దసరాపండుగ ముక్తసరిగా జరుపు కున్న ప్రజలు ఈసారి చిన్నా పెద్ద కలిసి పండుగలో పాలుపంచుకు న్నారు. విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించడంతో సొంత ఊళ్లకు చేరుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి, కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌, తదితర అధికార, నాయకగణం విజయదశమి వేడుకల్లో భాగస్వాములయ్యారు.

రూ. కోటితో మహాలక్ష్మి గుడి నిర్మాణం

జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్‌ ప్రాంతంలో కొలువైన మహాలక్ష్మి ఆలయం కోటిరూపాయలతో పునర్నిర్మించనున్నామని మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. అక్కడే ఉన్న పోచమ్మ, జంగల్‌ హనుమాన్‌ ఆలయాలను అభివృద్ధి చేస్తా మన్నారు. అంతకుముందు మహాలక్ష్మి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ చైర్మన్‌ గంగాధర్‌, స్థానిక కౌన్సిలర్లు బిట్లింగ్‌ నవీన్‌, రమాదేవి, కోఆప్షన్‌ సభ్యుడు గోవర్ధన్‌ పాల్గొన్నారు.

భక్తులతో ఆలయాల్లో సందడి

విజయదశమి సందర్భంగా జిల్లాలోని ఆలయాలు భక్తులతో సం దడిగా మారాయి. నిర్మల్‌లోని దేవరకోట, సాయిబాబా, దుర్గామాత, బంగల్‌ పేట్‌లోని మహలక్ష్మి హరిహరక్షేత్రం, రామాలయంలో భక్తులు ప్రత్యేకపూజలు జరిపారు. పారిశ్రామికవేత్త అల్లోల మురళీఽ దర్‌రెడ్డి, లక్కడి జగన్మోహన్‌రెడ్డి, కే.రాంకిషన్‌రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ధర్మాజీ రాజేందర్‌, మారుగొండ రాము, డి.శ్రీనివాస్‌, తదితర ప్రముఖులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్‌ ఈశ్వర్‌

విజయదశమి సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ము న్సిపల్‌ చైర్మన్‌ జి.ఈశ్వర్‌ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నివాసంలో కలుసుకున్నారు. మంత్రిని ఆలింగనం చేసుకొని ఆనందాన్ని పంచుకున్నారు. 

శమీపూజలో మంత్రి అల్లోల

స్థానిక గండిరామన్న సాయి బాబా ఆలయంలో శుక్రవారం రాత్రి  శమీపూజతో పాటు ప్రత్యేకపూజ జరిపారు. సింగిల్‌ట్రస్ట్‌ చైర్మన్‌ లక్కడి జగన్మోహన్‌రెడ్డి, ఆలయపూజారి అనురాగ్‌శర్మ, కందుల పండరి, ముక్కశేఖర్‌, జిందం గోవర్ధన్‌, గోపాల్‌రెడ్డి, జొన్నల మనోహర్‌, లింగారెడ్డి, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. ఆలయంలో సాయి చిత్రపటంతో ప్రదక్షిణలు జరిపారు. 

విశ్వహిందూపరిషత్‌ ఆధ్వర్యంలో రావణదహనం

నిర్మల్‌ కల్చరల్‌, అక్టోబరు 16 : విజయదశమి సందర్భంగా శుక్రవారం మహాలక్ష్మి ఆలయం వద్ద విశ్వహిందూపరిషత్‌ ఆధ్వర్యం లో దసరాఉత్సవాలు నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శమీపూజ, ఆయుధపూజ, దుర్గామాత కు ప్రత్యేకపూజ, రావణసంహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... జిల్లాలో 600 ఆలయాలు అభివృద్ధి చేసి నట్లు చెప్పారు. ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌తో పాటు విశ్వహిందూపరిషత్‌ అధ్యక్షుడు పతికే రాజేందర్‌, బీజేపీ నాయకుడు అయ్యన్నగారి భూమయ్యతో పాటు కౌన్సిలర్లు, గ్రంధాలయ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు. 

ప్రశాంతంగా దుర్గామాత నిమజ్జనం

నిర్మల్‌లో దుర్గామాత నిమజ్జనోత్సవం ప్రశాంతంగా నిర్వహిం చారు. దుర్గా మండళ్లు బంగల్‌పేట్‌ వినాయకసాగర్‌లో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం జరుపగా మహిళలు, భక్తులు పాల్గొన్నారు. 

ఆయుధపూజ నిర్వహించిన ఎస్పీ

జిల్లా సాయుధ దళ కార్యాలయంలో విజయదశమి పుర స్కరించుకుని ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ఆయుధాలకు పూజలు నిర్వ హించి జమ్మి చెట్టును నాటారు. విజయదశమి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖశాంతులతో జీవించాలని అన్నారు. పోలీ స్‌వాహనాలకు పూజలు జరిపారు. అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు (ఏఆర్‌) ఎసీబీ ఇన్స్‌పెక్టర్‌ రమేష్‌, ఆర్‌ఎస్సై వెంకటి, సిబ్బంది పాల్గొన్నారు. 

కుభీర్‌ : మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు శుక్రవారం దసరా పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగను పురష్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్ర గ్రామస్తులంతా కలిసి జంబి చెట్టు వద్దకు వెళ్లిపూజలు నిర్వహించి ఇంటికి తీసుకువచ్చారు. అనంతరం ఒకరికొకరు జంబి పంచుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలుపు కున్నారు. 

సారంగాపూర్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం ఘనంగా దసరా పండుగను నిర్వహించి ఒకరికొకరు దసరా శుభా కాంక్షలు తెలిపారు. అలాగే మహిళలు నూతన వస్ర్తాలను ధరించి డప్పుమేళాల మధ్య భక్తిగేయాలను పాడుతూ నృత్యాలు చేసు కుంటూ గ్రామాల్లో దుర్గామాతలను ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామాల సమీపంలో గల చెరువుల్లో నిమజ్జనం చేశారు. అనంతరం అన్న దాన కార్యక్రమాలను నిర్వహించారు. 

లక్ష్మణచాంద : దసరా పండుగను మండల ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఆయా గ్రామాల్లోని దసరా ఉత్సవ వేదిక వద్ద చెడును తుంచేసినట్లు భావించి గొర్రెను బలి ఇచ్చారు. అనంతరం జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించారు. జమ్మిఆకును బంగారంగా భావిస్తూ ఒకరికొకరు ఇచ్చుకుని దసరా పండుగ శుభా కాంక్షలు తెలుపుకున్నారు. అంతకుముందు దుర్గామాత విగ్రహాన్ని ఊరేగించి స్థానికంగా గల గోదావరి, చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ దుర్గామాత శోభాయాత్ర సందర్భంగా యువతులు నిర్వహిం చిన నృత్యాలు, కోలాటాలు పరువురిని అలరించాయి.

ముథోల్‌ : మండల కేంద్రమైన ముథోల్‌తో పాటు వివిధ గ్రామా ల్లో విజయదశమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. విజయదశమి వేడుకలను పురస్కరించుకొని కొత్త వస్త్రాలు ధరించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. గ్రామ పొలిమేరలోని జమ్మి చెట్టుకు భజా భజంత్రీలతో ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేకపూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రె డ్డి ఎంపీపీ అయేషా అప్రోజ్‌ ఖాన్‌, సర్పంచ్‌ వెంకటాపూర్‌ రాజేందర్‌, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీ నర్సాగౌడ్‌ మండల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు ప్రజల ఐక్యతకు ప్రతీకని పేర్కొన్నారు. ఉత్సాహంగా పండుగలు జరుపుకోవాలని అన్నారు. 

కుంటాల : మండల కేంద్రం కుంటాలతో పాటు అన్ని గ్రామాల్లో శుక్రవారం దసరాపండుగ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వ హించారు. పండుగను పురష్కరించుకొని నూతనవస్త్రాలను ధరించి సాయంత్రం జంబిచెట్టుకి పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరి కొకరు జంబి పంచుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుంటాల పోలీసుస్టేషన్‌ ఎస్సై శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఆయుధపూజ నిర్వహించారు. 

ఖానాపూర్‌ : మండల కేంద్రంలో శుక్రవారం దస రా సంబురాలు అంబరాన్నంటాయి. దసరా ఉత్సవా ల్లో భాగంగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ని ర్వహించిన రాంలీలా ఉత్స వాలకు మండల నలుమూలల నుండి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఈ సం దర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు మధ్యాహ్నం నిర్వహించిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అమ్మవారి ఉత్సవవిగ్రహాన్ని స్వయంగా ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. శమీ వృక్షానికి పూజలు నిర్వహించిన  అనంతరం శమీ ఆకులను ఒకరికొకరు అందజేసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎన్‌జీవో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అజ్మీరా శ్యాంనాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పుప్పాల శంకర్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ అబ్దుల్‌ ఖలీల్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ గొర్రె గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement