జిల్లాలో వరి పరిశోధనా సంస్థ

ABN , First Publish Date - 2021-02-25T05:19:26+05:30 IST

జిల్లాలో వరి పరిశోధనా సంస్థ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఈ సంస్థకు 25 ఎకరాలను కేటాయిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... జిల్లాలో విశాలమైన తీర ప్రాంతం ఉంది.

జిల్లాలో వరి పరిశోధనా సంస్థ
ఒప్పందం కుదుర్చుకుంటున్న అధికారులు

నైర వద్ద 25 ఎకరాల కేటాయింపు 

99 ఏళ్లపాటు లీజుకు

అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం

గుజరాతీపేట, ఫిబ్రవరి 24: జిల్లాలో వరి పరిశోధనా సంస్థ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఈ సంస్థకు 25 ఎకరాలను కేటాయిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... జిల్లాలో విశాలమైన తీర ప్రాంతం ఉంది. అయితే, తరచూ తుఫాన్లు,   వరదల కారణంగా తీర ప్రాంతాల్లో వరి పంట దెబ్బ తిని రైతులు తీవ్ర నష్టపోతున్నారు. దీన్ని గుర్తించిన అధికారులు తీర ప్రాంతాలకు అనుగుణంగా వరి వంగడాల తయారీ చేసేందుకు అవసరమైన పరిశోధనా సంస్థ ఏర్పాటుకు శ్రీకా రం చుట్టారు. తుఫాన్లు, వరదలు, భారీ వర్షాలను తట్టుకొనేలా సాంకేతిక పరిజ్ఞానంతో నూతన వరి రకాలను తయారు చేసేందుకు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా జాతీయ వరి పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రాంతీయ తీరప్రాంత వరి పరిశోధనా సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం నైరలోని జిల్లా వ్యవసాయ కళాశాల సమీపంలోని 25 ఎకరాల భూమిని 99 ఏళ్ల పాటు లీజుకు  కేటాయించారు.  ఈ మేరకు జాతీయ వరి పరిశోధనా సంస్థ డైరెక్టర్‌ దీపాంకర్‌ మైతి, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవి ద్యాలయ కంట్రోలర్‌ కె.ఎల్లారెడ్డిలు భూకేటాయింపు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వ్యవసాయ విశ్వవి ద్యాలయ బోర్డు మెంబర్‌ ఎన్‌వీఎస్‌ఆర్‌కే నేతాజీ, నైర వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్‌  ఏవీ రమణ, వరిపరిశోధనా సంస్థ శాస్త్రవేత్త రాజశేఖర్‌ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. రాష్ట్రమంతటికీ శ్రీకాకుళంలో పరిశోఽ దనా సంస్థను ఏర్పాటు చేయడం వల్ల జిల్లా తీరప్రాంత రైతులకు ఎంతో మేలు జరగ నుందని వ్యవసాయ విశ్వవిద్యాలయం కంట్రోలర్‌ ఎల్లారెడ్డి తెలిపారు. తీరప్రాంత సమస్యలకు అనుగుణంగా వరి పరిశోధనలు జరుగుతాయని డైరెక్టర్‌ దీపాంకర్‌ మైతి తెలిపారు. ఈ సంస్థ అంతరాష్ట్రంతో పాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రేతర ప్రాంతా ల్లో వరిసాగుకు సహకరిస్తుందని చెప్పారు. రైతులకు, శాస్త్రవేత్తలకు, విద్యార్థులకే కాకుండా సుమారు 200 మంది వరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.


Updated Date - 2021-02-25T05:19:26+05:30 IST