వరి వేస్తే.. రైతులకు ఉరి వేస్తారా?: నారాయణ

ABN , First Publish Date - 2021-10-31T01:35:42+05:30 IST

రి వేస్తే.. రైతులకు ఉరి వేస్తారా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

వరి వేస్తే.. రైతులకు ఉరి వేస్తారా?: నారాయణ

కోదాడ: వరి వేస్తే.. రైతులకు ఉరి వేస్తారా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రబీలో ప్రాజెక్టుల కింద వరి పంటలు సాగుచేయవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో ప్రకటనలు ఇప్పించడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రభుత్వం పంటలు సాగు చేయనప్పుడు, ప్రాజెక్టులు కమీషన్ల కోసమా అని ప్రశ్నించారు. సాగర్‌ ప్రాజెక్టు కింద యాసంగి పంటకు నీటిని విడుదల చేసి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. అవసరమైతే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ నేడు దోపిడీ దొంగల పాలైందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు దోచి పెట్టేందుకు ఎర్రతివాచీలు పరుస్తోందని నారాయణ ధ్వజమెత్తారు.

Updated Date - 2021-10-31T01:35:42+05:30 IST