సంక్షోభంలో రైస్‌ మిల్లులు

ABN , First Publish Date - 2020-05-29T11:21:14+05:30 IST

కరోనా, లాక్‌డౌన్‌నేపఽథ్యంలో రైస్‌ మిల్లింగ్‌ పరిశ్రమ సంక్షోభంలో పడింది. ధాన్యం మరపట్టే సమయంలో బియ్యంతోపాటు వచ్చే ..

సంక్షోభంలో  రైస్‌ మిల్లులు

కనిష్ట స్థాయికి పడిపోయిన ఊక ధర

తవుడు, నూక ధరలు అంతంత మాత్రమే

నష్టపోతున్నామంటున్న మిల్లర్లు


పాలకొల్లు, మే 28: కరోనా, లాక్‌డౌన్‌నేపఽథ్యంలో రైస్‌ మిల్లింగ్‌ పరిశ్రమ సంక్షోభంలో పడింది. ధాన్యం మరపట్టే సమయంలో బియ్యంతోపాటు వచ్చే ఉప ఉత్పత్తులు మిల్లర్ల కు ఆర్థికంగా మేలు చేస్తాయి. ఇప్పుడు ప్రభుత్వమే ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసి ప్రైవే టు రైస్‌ మిల్లింగ్‌ ద్వారా బియ్యాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. ధాన్యంలో 67 శాతం బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వ వలసి ఉంటుంది. ఇందుకు మిల్లర్లకు మిల్లింగ్‌చార్జీ, హామాలీ ల ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తుంది. బియ్యంతోపాటు వచ్చే ఊక, తవుడు, నూకలు, చిట్టు తదితర ఉప ఉత్పత్తులు మిల్ల ర్లు ప్రైవేటు మార్కెట్‌లో విక్రయించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఇచ్చే బియ్యమే రైస్‌ మిల్లులలో అధిక శాతం ఉంటుంది. మిల్లర్లు నేరుగా ధాన్యం కొనుగోలుచేసి బియ్యం మరపట్టి విఫణిలో విక్రయించే శాతం తక్కువగా ఉంటుంది. 


లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా జిల్లాలోనూ, రాష్ట్రం లోనూ అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. పరిశ్రమలు, పేప రు మిల్లులు, విద్యుత్‌ ప్లాంట్లు ఇలా పలువిధాలుగా బాయి లర్లలో మండించడానికి ఊకను వినియోగిస్తారు. అయితే నెలల తరబడి అనేక పరిశ్రమలు మూతపడడంతో ఊకకు డిమాండ్‌ తగ్గింది. గత ఏడాది టన్ను ఊక ధర రూ.2000 నుంచి 3000 ఉండగా, ఇప్పుడు ఆ ధర రూ.300కు పడిపో యింది. వచ్చేది వర్షాకాలం కావడం, ఊక నిల్వ చేయడానికి రైస్‌ మిల్లుల ప్రాంగణంలో తగిన జాగా లేకపోవడంతో ఊక ను అయినకాడికి అమ్ముకుంటున్నామని మిల్లర్లు చెబుతున్నారు. తవుడు ధర జనవరిలో క్వింటాలు రూ.2000 ఉండగా మార్చి నాటికి రూ.1200కు పడిపోయింది. ఇప్పుడు కొద్దిగా పెరిగి రూ.1700 వద్ద నిలకడగా ఉంది. చిరు నూక క్వింటాలు మార్చి మాసాంతంలో రూ.900 ఉండగా ఇప్పుడు రూ. 1300 కు చేరింది. తగ్గి పెరిగిన ధరలు మిల్లర్లకు అంతగా లాభం చేకూర్చడం లేదని చెబుతున్నారు. తవుడు, నూక పశువులకు దాణాతోపాటు రొయ్యల చెరువులకు నూక వినియోగిస్తారు. వచ్చే 1, 2 నెలల్లో ఉప ఉత్పత్తులకు డిమాండ్‌ రాకుంటే రైస్‌ మిల్లులు మరింత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని చెబుతున్నారు. 

Updated Date - 2020-05-29T11:21:14+05:30 IST