మంత్రులను కలిసిన రైస్ మిల్లర్స్

ABN , First Publish Date - 2022-01-07T21:39:26+05:30 IST

వ‌రంగ‌ల్ జిల్లా రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ బాధ్యులు రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మలాక‌ర్ ని కలిశారు. హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో శుక్ర‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా వారు క‌లిశారు.

మంత్రులను కలిసిన రైస్ మిల్లర్స్

హైదరాబాద్: వ‌రంగ‌ల్ జిల్లా రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ బాధ్యులు రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మలాక‌ర్ ని కలిశారు. హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో శుక్ర‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా వారు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు త‌మకు విధించిన ల‌క్ష్యానికి మ‌రికొద్ది బాయిల్డ్‌ రైస్ ఇవ్వాల్సి ఉంద‌ని, ఆ రైస్ ని త్వ‌ర‌లోనే ఇస్తామ‌ని చెప్పారు.


రాష్ట్రంలో ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ స‌ర్వ్ ప‌ద్ధ‌తిలో మిల్ల‌ర్ల నుండి రైస్ తీసుకుంటే, పౌర‌స‌ర‌ఫ‌రాల కార్పొరేష‌న్ పై భారం త‌గ్గి, రైస్ సేక‌ర‌ణ వేగంగా పూర్తి అవుతుంద‌ని మంత్రుల‌కు తెలిపారు. ఈ మేర‌కు ఒక విజ్ఞాప‌న ప‌త్రాన్ని వారు మంత్రుల‌కు స‌మ‌ర్పించారు. ఇందుకు మంత్రులు కూడా త‌మ సానుకూల‌త‌ను వ్య‌క్తం చేశారు. మంత్రుల‌ను క‌లిసిన వారిలో మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు తోట సంప‌త్ కుమార్‌, గోనెల ర‌వింద‌ర్‌, త‌క్కెళ్ళ‌ప‌ల్లి యుగంధ‌ర్ త‌దిత‌రులు ఉన్నారు. 

Updated Date - 2022-01-07T21:39:26+05:30 IST