రైస్‌ మిల్లర్లు కడ్తా తీయొద్దు

ABN , First Publish Date - 2021-05-08T05:27:28+05:30 IST

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొ నుగోలు ద్వారా రైస్‌మిల్లులకు తరలించే ధాన్యంలో ఎటు వంటి కడ్తా తీయవద్దని జిల్లా అదనపు జేసీ చంద్రశేఖర్‌ సూచించారు.

రైస్‌ మిల్లర్లు కడ్తా తీయొద్దు
జాన్కంపేట్‌ కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని పరిశీలిస్తున్న అదనపు చంద్రశేఖర్‌

వేల్పూర్‌, మే7: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొ నుగోలు ద్వారా రైస్‌మిల్లులకు తరలించే ధాన్యంలో ఎటు వంటి కడ్తా తీయవద్దని జిల్లా అదనపు జేసీ చంద్రశేఖర్‌ సూచించారు. వేల్పూర్‌ మండలం పచ్చలనడ్కుడ సొసై టీ పరిధిలోని జాన్కంపేట్‌ గ్రామంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం అదనపు జేసీ పరిశీలించారు. రైస్‌మిల్లులకు తరలించే ధాన్యంలో ఎటు వంటి కడ్తా తీయవద్దని ఈ విషయమై స్థానిక అధికా రులు చూసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రం లో రెండు కిలోల కడ్తా కాకుండా రైస్‌మిల్లుల వారు అదనంగా రెండున్నర నుంచి ఐదు కిలోల వరకు కడ్తా తీస్తున్నారని  అదనపు జేసీ చంద్రశేఖర్‌ ముందు రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి వచ్చి న రాష్ట్ర కిసాన్‌ఖేత్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి కొనుగో లు కేంద్రం వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో అవినీతి జరుగుతోందని, 40కిలోలకు 42కిలోల తూకం వేయడం వల్ల క్వింటాలుకు మూడు కిలోల చొ ప్పున రైతులు నష్టపోతున్నారని వివరించారు. అంతేగా కుండా రైస్‌మిల్లర్ల వారు కూడా మూడు నుంచి ఐదు కిలోల కడ్తా తీస్తున్నారని, దీంతో తీవ్ర నష్టం జరుగుతుం దని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేం ద్రాల్లో రైతులకు క్రాక్‌ షీట్‌ ఎందుకు ఇవ్వడంలేదని అడి గారు. రైస్‌మిల్లర్ల అవినీతి, డీసీవో కనుసన్నల్లోనే నడు స్తుందని ఫిర్యాదు చేశారు. రైతులను రైస్‌మిల్లర్లతో మా ట్లాడుకోవాలని చెప్పడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్‌మిల్లులకు వెళ్లిన ధాన్యాన్ని కడ్తా తీయకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ను ఆయన కోరారు. సంద ర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ సమస్యలన్నీ ప రిష్కరిస్తామని, హమాలీల కొరత లేకుండా చూస్తూ ధా న్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసేలా చర్యలు తీసు కుంటామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ విషయమై డీసీవోతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సతీష్‌రెడ్డి, ఆర్‌ఐ వేణు, సొసైటీ చైర్మన్‌ రా జారెడ్డి, స్థానిక సర్పంచ్‌ సౌడ ప్రేమలత, ఉపసర్పంచ్‌ సౌడ రమేష్‌, డైరెక్టర్‌ తలారి శేఖర్‌, జీపీ కార్యదర్శి మౌ నిక, సొసైటీ కార్యదర్శి స్వాతి, సొసైటీ మాజీవైస్‌చైర్మన్‌ కొలిప్యాక శ్రీనివాస్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-08T05:27:28+05:30 IST