మిల్లర్లకు రూ.48 కోట్లు విడుదల

ABN , First Publish Date - 2020-12-05T05:11:35+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని రైస్‌ మిల్లర్లకు చెల్లించాల్సిన బిల్లుల ను రూ.48 కోట్లు విడుదల చేసింది.

మిల్లర్లకు రూ.48 కోట్లు విడుదల

తాడేపల్లిగూడెం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని రైస్‌ మిల్లర్లకు చెల్లించాల్సిన బిల్లుల ను రూ.48 కోట్లు విడుదల చేసింది. మరో రూ.150 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిని కూడా చెల్లిస్తే మిల్లర్లకు మరిం త ఊరట లభించి ప్రభుత్వానికి బ్యాంక్‌ గ్యారంటీ(బీజీ) లు సమర్పించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొద్దిపాటి గ్యారంటీలు మాత్రమే సమర్పించారు. ఇప్పటి వరకు 282 మిల్లుల నుంచి రూ.350 కోట్ల విలువైన బ్యాంక్‌ గ్యారం టీలు పౌరసరఫరాల కార్పొరేషన్‌కు అందాయి. వాస్తవా నికి ఖరీఫ్‌లో దాదాపు రూ.2,250 కోట్ల విలువైన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మిల్లర్లకు కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం అప్పగిస్తుంది. అంతే మొత్తంలో మిల్లర్లు బ్యాంక్‌ గ్యారంటీలు ఇవ్వాలి. జిల్లాలో రూ.900 కోట్లకు సరిపడా గ్యారంటీలు ఇస్తున్నారు. మిల్లర్లు మరాడించి బియ్యం ప్ర భుత్వానికి అప్పగిస్తే ఉన్న బ్యాంక్‌ గ్యారంటీలనే మళ్లీ పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఇప్పటి వరకు మూడో వంతు మిల్లర్లు మాత్రమే ఇవ్వగలిగారు. దీనికి ప్రధాన కారణం.. గతంలో ఐదు శాతం మాత్రమే బ్యాం కులు మార్జిన్‌ సొమ్ములు వసూలు చేసేవి. ఇప్పుడు 15 శాతానికి పెంచేయడంతో అధికంగా సొమ్ములు కట్టాల్సి రావడంతో అనుకున్న విధంగా ఇవ్వలేకపోతున్నారు. 


Updated Date - 2020-12-05T05:11:35+05:30 IST